చేతన్ భగత్ కు ఆయన రాసిన పుస్తకం పైరసీ కాపీని అమ్మిన కుర్రాడు.. వీడియో వైరల్!
- రచయిత చేతన్ భగత్ కు వింత అనుభవం
- ఆయన నవలనే పైరసీ చేసి అమ్ముతున్న కుర్రాడు
- ట్విట్టర్ లో స్పందించిన చేతన్
దీంతో ఆ పిల్లాడు ‘ఇదిగోండి సార్.. తీసుకోండి. ఈ నవల చాలా బాగుంటుంది’ అని ఓ పైరేటెడ్ కాపీని అందించాడు. దీంతో చేతన్ స్పందిస్తూ..‘ఇది పైరసీ చేసిన బుక్ కదా’ అనగానే, సూరజ్ ‘ఇది ఆన్ లైన్ కాపీ సార్’ అని జవాబిచ్చాడు. అప్పటివరకూ నవ్వును ఆపుకున్న చేతన్ భగత్..‘నేనే చేతన్ భగత్ ను. మీరూ బాగా అమ్ముతున్నారు. థ్యాంక్యూ’ అని పుస్తకాన్ని కొనుక్కున్న చేతన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ట్విట్టర్ లో పంచుకున్న చేతన్..‘నేను పైరసీని ప్రోత్సహించను. కానీ ఇలాంటి పుస్తకాల వల్ల సూరజ్ లాంటి యువకుల పొట్ట నిండుతోంది’ అని వ్యాఖ్యానించారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందన్న విషయమై చేతన్ స్పష్టత ఇవ్వలేదు.