ధోనీ చింతించే రోజు వస్తుంది: వీవీఎస్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్య!
- నిన్నటి మ్యాచ్ లో నిదానంగా ఆడిన ధోనీ
- మొదటి నుంచి ధాటిగా ఆడాల్సిందన్న లక్ష్మణ్
- భవిష్యత్ లో వెనుదిరిగి చూసుకుని చింతించక తప్పదని వ్యాఖ్య
నిన్నటి మ్యాచ్ లో 29వ ఓవర్ లో కేదార్ జాదవ్ అవుట్ అయిన తరువాత క్రీజ్ లోకి వచ్చిన ధోనీ, వేగంగా ఆడలేదన్న సంగతి తెలిసిందే. చివరి వరకూ ఉన్న ధోనీ, ఆఖర్లో బ్యాట్ ను ఝళిపించి 56 పరుగులు చేశాడు. అంతకుముందు చాలాసేపు సింగిల్స్ కు మాత్రమే పరిమితం అయ్యాడు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ మ్యాచ్ లో ఇండియా విజయం సాధించింది కాబట్టి, ధోనీ తప్పించుకున్నాడని మాజీలు అభిప్రాయపడ్డారు. ధోనీ హాఫ్ సెంచరీ చేయడం కలిసొచ్చిన అంశమే అయినా, క్రీజ్ లోకి వచ్చినప్పటి నుంచి అదే విధంగా ఆడివుంటే బాగుండేదని, పాండ్య ఆరంభం నుంచే సానుకూల దృక్పథంతో ఆడాడని, ధోనీ అలా ఆడలేదని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.