కొత్త సినిమాను మొదలెట్టేసిన కల్యాణ్ రామ్
- కల్యాణ్ రామ్ నుంచి 17వ సినిమా
- ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సాగే కథ
- కథానాయికగా మెహ్రీన్
'శతమానం భవతి' .. 'శ్రీనివాస కల్యాణం' వంటి కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించిన సతీశ్ వేగేశ్న, ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. మెహ్రీన్ కథానాయికగా నటించనున్న ఈ సినిమా, కొంతసేపటి క్రితం పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఆదిత్య మ్యూజిక్ వారు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి తొలిసారిగా చేస్తోన్న ఈ సినిమాకి, గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగుకి చకచకా సన్నాహాలు జరిగిపోతున్నాయి.