అమెరికాలో హరీశ్ రావు... ఇప్పుడే ఎందుకెళ్లారన్న బీజేపీ నేత లక్ష్మణ్
- అమెరికా పర్యటనలో ఉన్న హరీశ్ రావు
- టీఆర్ఎస్ ఎన్నారై కార్యక్రమంలో పాల్గొన్న హరీశ్
- కేసీఆర్ మూడు తప్పులు చేస్తున్నారన్న లక్ష్మణ్
మరోవైపు హరీశ్ రావుపై బీజేపీ నేత లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 23న ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయని... ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో అమెరికాకు ఆయన ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీకి ఓట్ల శాతం పెరిగిందని... ఏడు స్థానాల్లో కాంగ్రెస్ మూడో స్థానంతో సరిపెట్టుకుంటుందని చెప్పారు. కేసీఆర్ మంచి పనులు చేస్తున్నప్పటికీ... మూడు తప్పిదాల వల్ల అప్రతిష్టను మూటగట్టుకుంటున్నారని తెలిపారు.