డబ్బులకు ఆశపడే కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్‌లోకి వెళుతున్నారు: విజయశాంతి
- కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో తెలియదా?
- అసలైన తెలంగాణ ఇంకా రాలేదు
- కేసీఆర్ మాటలు నమ్మొద్దు
కొంతమంది కాంగ్రెస్ నాయకులు డబ్బులకు ఆశపడి టీఆర్‌ఎస్ లోకి వెళ్తున్నారని విమర్శించారు. కేసీఆర్ మాటలు నమ్మకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. 2014లో ఎర్రవెల్లిలో 34 ఎకరాలు మాత్రమే ఉండేదని, కానీ ఇప్పుడు వంద ఎకరాల భూమిని కొన్నారని ఆరోపించారు. రాహుల్ ప్రకటించిన కనీస ఆదాయ భరోసా పథకం ఎంతో మంచి పథకమని, దానిని ప్రకటించడం సంతోషంగా ఉందని విజయశాంతి వ్యాఖ్యానించారు.