ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.. అంతకుమించిన పని చాలా ఉంది: విజయశాంతి
- ఎంపీగా పోటీ చేయాలన్న ఉద్దేశం లేదు
- కాంగ్రెస్ అధిష్ఠానం నాపై గురుతర బాధ్యత ఉంచింది
- ఓ నియోజకవర్గానికి పరిమితం కావాలనుకోవడం లేదు
ఎన్నికలకు ముందు వచ్చే రెండు నెల్లలో పార్టీ తరపున రెండు, మూడు రాష్ట్రాల్లో నిర్వహించబోయే వందలాది సభలు, ర్యాలీల్లో పాల్గొనాల్సి ఉందని విజయశాంతి తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తానని పేర్కొన్నారు. తనపై ఇంత పెద్ద బాధ్యత ఉన్నప్పుడు ఎంపీగా పోటీ చేసి ఓ నియోజకవర్గానికి పరిమితం కావాలనుకోవడం సరికాదని విజయశాంతి ట్వీట్ చేశారు.