అక్క కోసం ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ప్రచారానికి రాలేకపోయిన కారణమిదే: టీడీపీ
- కూకట్ పల్లిలో టీడీపీ అభ్యర్థినిగా సుహాసిని
- ఇద్దరు హీరోలూ షూటింగ్ లో బిజీ
- ప్రస్తుతం రాజమౌళి చిత్రంలో నటిస్తున్న ఎన్టీఆర్
ఇక ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు తీరిక లేనంత షూటింగుల్లో బిజీగా ఉండటంతోనే వారిద్దరూ ప్రచారానికి రాలేదని తెలుగుదేశం పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఎన్టీఆర్, రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలసి ఓ మల్టీస్టారర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం ఆయన 100 కిలోలకు పైగా బరువు పెరిగారని సమాచారం. తన లుక్ బయటకు వెళ్లకుండా చూడాలన్న ఉద్దేశంతోనే ఎన్టీఆర్ ప్రచారానికి వెళ్లలేదని సమాచారం.