మహేశ్ బాబు రికార్డును తుడిచేస్తున్న '2.ఓ'
- శంకర్ దర్శకుడిగా '2.ఓ'
- రేపే భారీస్థాయిలో థియేటర్లకు
- కొత్త రికార్డులకు తెరలేచినట్టే
'2.ఓ' ను హైదరాబాద్ లోని ప్రసాద్ ఐ మాక్స్ లో తొలి రోజున 35 షోలు ప్రదర్శించనున్నారు. ప్రసాద్ ఐ మ్యాక్స్ లో ఇంతవరకూ అత్యధిక షోలు ప్రదర్శించబడిన చిత్రంగా 'బిజినెస్ మేన్' వుంది. అప్పట్లో పూరి .. మహేశ్ బాబుకి గల క్రేజ్ కారణంగా ఐ మ్యాక్స్ లో తొలి రోజున 'బిజినెస్ మేన్' 33 షోలను ప్రదర్శించారు. 7 సంవత్సరాలుగా మహేశ్ బాబు పేరు మీద నిలకడగా వున్న ఆ రికార్డును తాజాగా '2.ఓ' సినిమా తుడిచేయనుంది. 600 కోట్ల ఖర్చుతో నిర్మించిన '2.ఓ' మరిన్ని రికార్డులను సొంతం చేసుకుంటూ దూసుకెళ్లడం ఖాయమనే అభిప్రాయాలను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.