నాగశౌర్య హీరోగా కొత్త సినిమా ప్రారంభం
- రాజేంద్ర దర్శకత్వంలో నాగశౌర్య
- సంగీత దర్శకుడిగా మహతి స్వరసాగర్
- ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్
కథలో కొత్తదనం కారణంగా .. ఇంతవరకూ తాను ఈ తరహా పాత్రను చేయకపోవడం వల్లనే నాగశౌర్య ఓకే చెప్పాడని అంటున్నారు. ఈ సినిమా ద్వారా రాజేంద్ర కొలుసు దర్శకుడిగా పరిచయం కానున్నాడు. కొంతసేపటి క్రితం ఈ ప్రాజెక్టును లాంచ్ చేశారు. ఆనంద్ ప్రసాద్ నిర్మించే ఈ సినిమాకి మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చనున్నాడు. ఆగస్టు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును జరుపుకోనుంది. హీరోయిన్ తో పాటు ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు.