మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో .. దర్శకుడిగా అవసరాల శ్రీనివాస్
- హీరోగా వైష్ణవ్ తేజ్
- దర్శకుడిగా అవసరాల
- మరో సినిమా చిరు చిన్నల్లుడు కల్యాణ్ తో
ఇప్పటికే అందుకు కావలసిన శిక్షణను వైష్ణవ్ తేజ్ పూర్తిచేశాడని అంటున్నారు. సాయి కొర్రపాటి నిర్మించే ఈ సినిమాకి అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నట్టు చెబుతున్నారు. ఇక ఈ సినిమా తరువాత చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ తోను అవసరాల ఒక సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. అవసరాల దర్శక ప్రతిభ పట్ల గల నమ్మకంతో ఈ రెండు ప్రాజెక్టులను ఆయనకి అప్పగించినట్టుగా చెప్పుకుంటున్నారు.