స్వల్పంగా మారిన షెడ్యూల్... కోల్ కతా కాళిని దర్శించుకోనున్న కేసీఆర్
- కాళీ మాతను దర్శించుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్న కేసీఆర్
- వెంటనే షెడ్యూల్ లో మార్పులు
- సాయంత్రం 6 తరువాత కాళీఘాట్ కు కేసీఆర్
నేటి సాయంత్రం 6 గంటల తరువాత ఆయన కాళీఘాట్ కు వెళతారని అధికారులు వెల్లడించారు. అక్కడ ప్రత్యేక పూజల అనంతరం కేసీఆర్ హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారని తెలిపారు. కాగా, ఈ మధ్యాహ్నం 11.35 గంటల సమయంలో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న కేసీఆర్ బృందం, ప్రత్యేక విమానంలో కోల్ కతాకు బయలుదేరింది. కేసీఆర్ విమానం 1.30 గంటల సమయంలో కోల్ కతా ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ కానుండగా, అక్కడి నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాన్వాయ్ లో సెక్రటేరియేట్ కు కేసీఆర్ చేరుకుంటారు.