మహేశ్ పాటలో నుంచి నాగశౌర్య న్యూ మూవీ టైటిల్
- 'ఛలో'తో హిట్ కొట్టిన నాగశౌర్య
- షూటింగు దశలో 'అమ్మమ్మగారిల్లు'
- త్వరలో కాశీ విశ్వనాథ్ తో సెట్స్ పైకి
చాలా గ్యాప్ తరువాత, నాగశౌర్యతో ఆయన ఈ సినిమా చేస్తూ, మళ్లీ మెగా ఫోన్ పడుతున్నాడు. ఈ సినిమాకి 'గురువారం మార్చి 1'అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు. మహేశ్ బాబు సినిమా 'దూకుడు'లో 'గురువారం మార్చి 1' అంటూ ఒక పాట మొదలవుతుందనే విషయం తెలిసిందే. పాప్యులర్ అయిన ఆ పాటలో నుంచే ఈ టైటిల్ ను సెట్ చేశారు. 'ఏ మాయ చేశావే' .. 'సాహసం శ్వాసగా సాగిపో' టైటిల్స్ కూడా మహేశ్ బాబు పాటల్లో నుంచి పుట్టుకొచ్చినవే.