భన్సాలీపై పగ తీర్చుకోబోతున్న కర్ణి సేన... ఆయన తల్లిపై సినిమా నిర్మించే ప్రయత్నం
- తమ తల్లి పద్మావతిని కించపరిచినందుకు ప్రతీకారం
- 'లీలా కీ లీలా' అని సినిమా పేరు ఖరారు
- దర్శకత్వం వహించబోతున్న అరవింద్ వ్యాస్
- ఏడాది వ్యవధిలో విడుదల
'సినిమా స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే ప్రారంభమైంది. సినిమాకు 'లీలా కీ లీలా' అనే పేరు ఖరారు చేశాం. అరవింద్ వ్యాస్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారు. ఓ ఏడాది వ్యవధిలో ఈ సినిమాను రిలీజ్ చేస్తాం' అని గోవింద్ సింగ్ ప్రకటించారు. తాము తల్లిగా భావించే పద్మావతిపై సంజయ్ లీలా భన్సాలీ సినిమాను తెరకెక్కించడమే కాక అది రిలీజ్ చేసి ఆమెని అవమానించాడని, కానీ తాము సంజయ్ లీలా భన్సాలీ తల్లిపై తెరకెక్కించే సినిమా చూస్తే, అతడు గర్వపడేలా ఉంటుందని గోవింద్ స్పష్టంచేశారు.