సమంత చేతుల మీదుగా 'కాశి' మూవీ సాంగ్ రిలీజ్!
- విజయ్ ఆంటోనీ హీరోగా 'కాశి'
- తమిళంలో టైటిల్ 'కాళి'
- రెండు భాషల్లో మార్చి 30న రిలీజ్
విజయ్ ఆంటోనీ సొంత బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమా నుంచి, 'అందమా .. అందమా నన్ను ఎత్తుకుపో ' అనే మొదటి సాంగ్ ను కొంతసేపటి క్రితం సమంత చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. గ్రామీణ నేపథ్యంలో చిత్రీకరించిన ఈ పాట అందంగా .. ఆహ్లాదంగా కొనసాగింది. హృద్యమైన సంగీతంతో మనసును ఆకట్టుకుంది. తెలుగు .. తమిళ భాషల్లో మార్చి 30వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు