అనుష్క పుట్టినరోజున ఖరీదైన కారును గిఫ్ట్ గా ఇచ్చిన ప్రభాస్?
- ఇటీవలే పుట్టినరోజు వేడుక జరుపుకున్న ప్రభాస్
- ఖరీదైన రిస్ట్ వాచ్ ను కానుకగా ఇచ్చిన అనుష్క
- ఈ నెల 7వ తేదీన పుట్టినరోజు వేడుక జరుపుకున్న అనుష్క
ఇక ఇటీవల ప్రభాస్ బర్త్ డే కి అనుష్క చేసిన ట్వీట్ .. ఆయన పట్ల ఆమెకి గల అభిమానాన్ని చాటి చెప్పింది. "నేను ఎంతగానో ప్రేమించే అద్భుతమైన వ్యక్తి ప్రభాస్ .. సుఖశాంతులతో .. సంపూర్ణ ఆరోగ్యంతో వుండాలని కోరుకుంటున్నాను" అంటూ శుభాకాంక్షలు తెలియజేసింది. అంతే కాకుండా కొత్తగా మార్కెట్లోకి వచ్చే ఖరీదైన రిస్ట్ వాచ్ లను ఇష్టపడే ప్రభాస్ కి, ఒక రిస్ట్ వాచ్ ను కానుకగా ఇచ్చింది. అలాంటి అనుష్క ఈ నెల 7వ తేదీన పుట్టినరోజు వేడుక జరుపుకుంది. ఆమె బర్త్ డే గిఫ్ట్ గా ప్రభాస్ ఓ 'బీఎం డబ్ల్యూ' కారును గిఫ్ట్ గా ఇచ్చాడనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.