తెలుగు సినిమాల్లో పని చేయడం గొప్పగా అనిపించింది: సన్నీలియోన్
- ‘గరుడవేగ’లో ‘డియో డియో డిసక డిసక..’ అనే స్పెషల్ సాంగ్ లో సన్నీ
- దక్షిణాది సినిమాల్లో పనిచేయడం సంతోషంగా ఉంటుంది
- మోహన్ బాబు నన్ను అభినందించారు
‘తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు స్పెషల్ సాంగ్స్ లోనే నటించారు కదా! ఏదైనా పాత్రలో నటించే అవకాశాలు ఉన్నాయా?’ అని ప్రశ్నించగా, ‘మంచి ప్రాజెక్టులో అవకాశం వస్తే కచ్చితంగా నటిస్తా’ అని సమాధానమిచ్చింది. ‘తెలుగులో మీకు ఇష్టమైన స్టార్?’ అనే ప్రశ్నకు..‘నాకు అలాంటి విషయాలపై ఆసక్తి ఉండదు, నేను చేసే పనికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా’ అని స్పష్టంగా చెప్పింది.
గతంలో వచ్చిన ‘కరెంట్ తీగ’ చిత్రంలో మంచు మనోజ్ తో కలిసి ఓ స్పెషల్ సాంగ్ లో నటించానని, ఆ సందర్భంగా నటుడు మోహన్ బాబు తనను అభినందించారని, ఆ విషయాన్ని తాను ఎప్పటికీ మరవలేనని ఓ ప్రశ్నకు సమాధానంగా సన్నీలియోన్ చెప్పింది. కాగా, ‘గరుడవేగ’ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.