నాగశౌర్య న్యూ మూవీ టైటిల్ 'ఛలో'
- నాగశౌర్య తాజా చిత్రంగా 'ఛలో'
- సొంత బ్యానర్ పై నిర్మాణం
- దర్శకుడిగా వెంకీ కుడుముల
- కథానాయికగా రష్మిక మందన
తాజాగా ఈ సినిమాకి 'ఛలో' అనే టైటిల్ ను ఫిక్స్ చేసి .. అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాతో నిర్మాతలుగా మారినందుకు హ్యాపీగా ఉందని నాగశౌర్య తల్లిదండ్రులు చెప్పారు. నాగశౌర్య క్రేజ్ ను మరింతగా పెంచేదిగా ఈ సినిమా ఉంటుందంటూ దర్శకుడు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కథానాయికగా రష్మిక మందన కూడా చాలా బాగా చేసిందనీ, డిసెంబర్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నామని చెప్పాడు.