అనిరుధ్-కావ్యా మారన్ వెడ్డింగ్ రిసెప్షన్.. సీఎం రేవంత్, కేటీఆర్‌లకు ఆహ్వానం
- నవంబర్ 21న చెన్నైలో వివాహ విందు
- రేవంత్‌రెడ్డి, కేటీఆర్‌లను స్వయంగా ఆహ్వానించిన కళానిధి మారన్ దంపతులు
- కొంతకాలంగా సాగుతున్న ప్రచారానికి అధికారికంగా తెర
- సోషల్ మీడియాలో పెళ్లి తేదీపై కొనసాగుతున్న ఊహాగానాలు
ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్యా మారన్ల వివాహ రిసెప్షన్‌కు ముహూర్తం ఖరారైంది. నవంబర్ 21న చెన్నైలో ఈ వేడుక జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావులను సన్ గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్ దంపతులు స్వయంగా ఆహ్వానించారు.
శుక్రవారం హైదరాబాద్‌లో పర్యటించిన కళానిధి మారన్, ఆయన అర్ధాంగి కావేరి మారన్.. తొలుత జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డి దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. తమ కుమార్తె కావ్యా మారన్, అనిరుధ్ రవిచందర్ల వివాహ రిసెప్షన్‌కు తప్పకుండా హాజరు కావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) తన అధికారిక ఎక్స్ ఖాతాలో ధ్రువీకరించింది. అనంతరం కళానిధి మారన్ దంపతులు బీఆర్ఎస్ నేత కేటీఆర్, ఆయన భార్య శైలిమను కలిసి రిసెప్షన్‌కు ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ నూతన దంపతులకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు.
గత కొంతకాలంగా అనిరుధ్, కావ్యా మారన్ల ప్రేమ, పెళ్లి గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. గతంలో ఈ వార్తలను అనిరుధ్ ఖండించాడు. ఆ తర్వాత నటుడు వై.జి. మహేంద్రన్‌తో కావ్య వివాహం జరుగుతుందన్న ప్రచారం కూడా జరిగింది. అయితే, తాజా ఆహ్వానాలతో ఈ వార్తలకు అధికారికంగా ముగింపు పలికినట్టు అయింది.
అయితే, రిసెప్షన్ తేదీని అధికారికంగా ప్రకటించినప్పటికీ, పెళ్లి తేదీపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. నవంబర్ 10 లేదా 11న గ్రీస్‌లో వీరి వివాహం జరగనుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ఇరు కుటుంబాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ వివాహ వేడుకకు సినీ, క్రీడా, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.