ఎల్ నినోపై సీఎం రేవంత్ పిలుపు.. స్పందించిన నాగార్జున
- ఎల్ నినోపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సీఎం రేవంత్ పిలుపున
- సహాయం చేయడానికి సినీ పరిశ్రమ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్న నాగార్జున
- తెలంగాణలో తీవ్ర నీటి, విద్యుత్ సంక్షోభం తప్పదని హెచ్చరించిన ప్రభుత్వం
తెలంగాణలో ఎల్ నినో ప్రభావంతో తలెత్తనున్న సంక్షోభంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చిత్ర పరిశ్రమ సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపునకు ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున సంపూర్ణ మద్దతు ప్రకటించారు. విపత్కర పరిస్థితుల్లో సహాయం అందించేందుకు సినీ రంగం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఇటీవల 'ఇట్లు అర్జున' చిత్రానికి సంబంధించిన ఓ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ, ఎల్ నినో ప్రభావం కేవలం తెలంగాణకే పరిమితం కాదని, ఇది ప్రపంచవ్యాప్త సమస్య అని పేర్కొన్నారు. ఇటువంటి క్లిష్ట సమయాల్లో ప్రజల్లో చైతన్యం తీసుకురావడం అత్యవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. సామాజిక సమస్యలు ఎదురైనప్పుడు సినీ పరిశ్రమ ఎల్లప్పుడూ ముందుండి తన వంతు సహకారాన్ని అందిస్తుందని ఆయన గుర్తుచేశారు. ఎల్ నినో ప్రభావం ఎంతకాలం కొనసాగుతుందో అంచనా వేయలేమని, అందుకే ప్రజలందరూ నీటిని పొదుపుగా వినియోగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో తీవ్ర నీటి, విద్యుత్ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించిన సంగతి విదితమే. వర్షపాతం గణనీయంగా తగ్గడం వల్ల కృష్ణా, గోదావరి బేసిన్లలోని జలాశయాల్లో నీటి నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయని ప్రభుత్వం వెల్లడించింది. సాధారణంగా అవసరమయ్యే 460 టీఎంసీలకు గాను, ప్రస్తుతం కేవలం 200-209 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉందని వివరించింది.
ఈ నేపథ్యంలో, రాబోయే యాసంగి సీజన్లో నీటి వినియోగం ఎక్కువగా ఉండే వరి సాగును తగ్గించుకోవాలని లేదా వాయిదా వేసుకోవాలని రైతులకు ముఖ్యమంత్రి సూచించారు. తాగునీటి సరఫరాకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ, విద్యుత్ను కూడా అత్యంత పొదుపుగా వినియోగించాలని ఆయన ప్రజలను కోరారు.