పాకిస్థాన్‌లో క్రైస్తవుడికి మరణశిక్ష ఖరారు.. సుప్రీంకోర్టు తీర్పుపై తీవ్ర విమర్శలు
- దైవదూషణ కేసులో క్రైస్తవుడి మరణశిక్షను సమర్థించిన పాక్ సుప్రీంకోర్టు
- అదే కేసులో నిందితుడి సోదరుడికి కోర్టు నుంచి విముక్తి
- ఒకే సాక్ష్యం ఇద్దరికీ భిన్నంగా ఎలా వర్తిస్తుందని ప్రశ్నిస్తున్న న్యాయవాదులు
- పాక్‌లో మైనారిటీలపై హింస పెరిగిందన్న మానవ హక్కుల కమిషన్ నివేదిక
- హిందూ, క్రైస్తవ బాలికల కిడ్నాప్‌లు, బలవంతపు వివాహాలపై తీవ్ర ఆందోళన
పాకిస్థాన్‌లో దైవదూషణ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక క్రైస్తవ వ్యక్తికి విధించిన మరణశిక్షను ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. మహమ్మద్ ప్రవక్తను కించపరిచే విధంగా వెబ్సైట్లో వ్యాఖ్యలు పోస్ట్ చేశారనే అభియోగాలపై ఖైజర్ అయూబ్‌కు విధించిన మరణశిక్షను సుప్రీంకోర్టు ఖరారు చేసింది. అయితే, ఇదే కేసులో నిందితుడిగా ఉన్న అతని సోదరుడు 46 ఏళ్ల అమూన్ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఒకే సాక్ష్యాధారాల ప్రతిపాదికన విచారించిన కేసులో ఇద్దరు సోదరులకు భిన్నమైన తీర్పులు వెలువడటంపై బాధితుల తరఫు న్యాయవాదులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని వారు అత్యంత వినాశకరమైనదిగా అభివర్ణించారు.
ఖైజర్, అమూన్ సోదరులపై 2018లో దైవదూషణ చట్టం కింద కేసు నమోదైంది, అప్పట్లోనే వారికి మరణశిక్ష విధించారు. దీనిని సవాలు చేస్తూ వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఒక సోదరుడిపై సాక్ష్యాధారాలు సరిపోవని భావించినప్పుడు, అవే ఆధారాలతో మరొకరికి మరణశిక్షను ఎలా ఖరారు చేస్తారని సెంటర్ ఫర్ లీగల్ ఎయిడ్, అసిస్టెన్స్ అండ్ సెటిల్మెంట్ (సీఎల్ఏఏఎస్) డైరెక్టర్ నాసిర్ సయీద్ ప్రశ్నించారు.
తాను 2009లోనే తన వెబ్‌సైట్‌ను నిలిపివేశానని, అయితే తన ముస్లిం స్నేహితుడు ఒకరు దానిని పునరుద్ధరించి, కాపీరైట్ వివరాలలో తన పేరును అలాగే ఉంచారని ఖైజర్ తన వాదనలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, ఖైజర్ ప్రాణాలను రక్షించాలని, దైవదూషణ చట్టాల దుర్వినియోగాన్ని కట్టడి చేయాలని న్యాయవాదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
ఈ తీర్పు పాకిస్థాన్‌లో మతపరమైన మైనారిటీల రక్షణపై నెలకొన్న ఆందోళనలను మరోసారి తెరపైకి తెచ్చింది. పాకిస్థాన్ మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీపీ) విడుదల చేసిన 'సాంక్చురీ డినైడ్: 2025/26లో మత స్వేచ్ఛ' నివేదిక ప్రకారం, దేశంలోని మైనారిటీలు వ్యవస్థీకత హింసను, వివక్షను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా హిందూ, క్రైస్తవ వర్గాలకు చెందిన బాలికల అపహరణ, బలవంతపు మతమార్పిడులు, వివాహాలు, దైవదూషణ చట్టాల దుర్వినియోగం, ఉగ్రవాద దాడులు వంటివి నిరంతరం కొనసాగుతున్నాయని 'బర్నబాస్ ఎయిడ్' నివేదిక హెచ్చరించింది.
సింధ్ ప్రావిన్స్‌కు చెందిన హిందూ హక్కుల కార్యకర్త ఫకీర్ శివ కచ్చి అందించిన గణాంకాలను హెచ్ఆర్సీపీ ఈ సందర్భంగా ఉటంకించింది. 2025లో 36 మంది, 2026 ప్రథమార్థంలో 32 మంది హిందూ బాలికలు అపహరణకు గురయ్యారని ఆ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇవి కేవలం వెలుగులోకి వచ్చిన కేసులు మాత్రమేనని, వాస్తవంగా ఇలాంటి ఘటనలో ఇంకా ఎన్నో ఉండవచ్చని కచ్చి పేర్కొన్నట్లు నివేదిక వివరించింది. కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికే పోలీస్ స్టేషన్ల ముందు నిరసనలు చేపట్టాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వీటితో పాటు అహ్మదీయ వర్గంపై దాడులు, సామాజికంగా వారిని వెలివేయడానికి జరుగుతున్న ప్రయత్నాలను కూడా ఈ నివేదికలో పొందుపరిచారు.