దసరా రద్దీ దృష్ట్యా 7 వేల ప్రత్యేక బస్సులు నడుపుతున్నాం: తెలంగాణ ఆర్టీసీ ఎండీ
- రేపటి నుంచి ఈ నెల 19వ తేదీ వరకు అదనపు బస్సులు
- పండుగ అనంతరం రద్దీ దృష్ట్యా ప్రత్యేక సర్వీసులు సిద్ధం చేసినట్లు వెల్లడి
- ప్రత్యేక సర్వీసుల వివరాల కోసం టోల్ ఫ్రీ నెంబర్లలో సంప్రదించాలని సూచన
దసరా పండుగ వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) భారీ ఏర్పాట్లు చేసింది. పండుగ పూట సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తోంది. దసరా రద్దీని దృష్టిలో ఉంచుకుని 7 వేల ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి వెల్లడించారు.
దసరా పర్వదినం సందర్భంగా రద్దీ కొనసాగుతున్న దృష్ట్యా రేపటి నుంచి 19వ తేదీ వరకు అదనపు బస్సులు నడపాలని ఆర్టీసీ ఎండీ అధికారులను ఆదేశించారు. అలాగే పండుగ అనంతరం సొంత ఊళ్ల నుంచి నగరానికి, ఇతర ప్రాంతాలకు తిరుగు ప్రయాణమయ్యే వారి కోసం పెద్ద ఎత్తున ప్రత్యేక సర్వీసులను సిద్ధం చేసినట్లు వెల్లడించారు.
ప్రయాణికులు తమ టికెట్లను సంస్థ అధికారిక వెబ్సైట్ tgsrtcbus.in ద్వారా ముందస్తుగా బుక్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు. ప్రత్యేక సర్వీసులకు సంబంధించిన ఇతర వివరాల కోసం 040-69440000, 040-23450033 నంబర్లలో కాల్ సెంటర్లను సంప్రదించాలని కోరారు.