ఉత్తరాఖండ్‌లో వరుస భూకంపాలు.. ఒకే రోజు రెండుసార్లు ప్రకంపనలు
- ఉత్తరాఖండ్‌ను వణికించిన మరో భూకంపం
- ఉత్తరకాశీలో 4.2 తీవ్రతతో ప్రకంపనలు
- శనివారం ఒక్కరోజే రెండుసార్లు కంపించిన భూమి
- బాగేశ్వర్‌లోనూ స్వల్ప తీవ్రతతో భూకంపం
- కొద్దిరోజుల క్రితం చమోలీలోనూ కంపించిన ధరణి
ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. శనివారం ఒక్కరోజే రాష్ట్రంలో రెండుసార్లు భూమి కంపించింది. సాయంత్రం ఉత్తరకాశీ జిల్లాలో భూకంపం సంభవించగా, అంతకు కొన్ని గంటల ముందు బాగేశ్వర్ జిల్లాలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. వరుస ఘటనలతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సీఎస్) వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈరోజు రాత్రి 8:07 గంటల సమయంలో ఉత్తరకాశీ జిల్లాలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.2గా నమోదైంది. భూమికి 11 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
అంతకుముందు మధ్యాహ్నం 3:40 గంటలకు బాగేశ్వర్ జిల్లాలో కూడా స్వల్ప ప్రకంపనలు వచ్చాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.8గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం 5 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు ఎన్‌సీఎస్ తెలిపింది. ఈ రెండు భూకంపాల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు ఇంతవరకు సమాచారం అందలేదు.
ఇటీవలి కాలంలో ఉత్తరాఖండ్‌లో భూకంపాలు తరచూ సంభవిస్తున్నాయి. అక్టోబర్ 6వ తేదీన చమోలీ జిల్లాలో 4.9 తీవ్రతతో భూకంపం రాగా, దాని ప్రభావం దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాలపై కూడా పడింది. తాజా ప్రకంపనలతో దేవభూమిలో మరోసారి భూకంపాల భయం నెలకొంది.