కాళేశ్వరంలో చెత్త చూసి షాకైన టాలీవుడ్ డైరెక్టర్.. వైరల్‌గా మారిన పోస్ట్
Add ap7am to your home Screen

కాళేశ్వరంలో చెత్త చూసి షాకైన టాలీవుడ్ డైరెక్టర్.. వైరల్‌గా మారిన పోస్ట్

Venu Udugula shocked by garbage at Kaleshwaram viral post
  • కాళేశ్వరం వద్ద పేరుకుపోయిన చెత్తపై వేణు ఉడుగుల ఆవేదన
  • దీనికి సంబంధించిన వీడియోను ‘ఎక్స్‌’లో షేర్ చేసిన డైరెక్టర్‌
  • ‘మన కాళేశ్వరం.. దక్షిణ భారత త్రివేణి సంగమం కాదా?’ అని ప్రశ్న
  • దుర్వాసనతో ఒక్క క్షణం కూడా నిలబడలేని స్థితిలో ఉందని ఆవేదన
  • అధికారంలో ఉన్న ప్రభుత్వం దీనిపై బాధ్యత తీసుకోవాలని సూచన
కాళేశ్వరం వద్ద పేరుకుపోయిన చెత్తపై టాలీవుడ్ దర్శకుడు వేణు ఉడుగుల ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ‘ఎక్స్‌’లో షేర్ చేశారు. కాళేశ్వరం పరిస్థితిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

‘మన కాళేశ్వరం.. దక్షిణ భారత త్రివేణి సంగమం కాదా?’ అంటూ ప్రశ్నించారు. అంతటి పవిత్ర ప్రదేశం దుర్వాసనతో ఒక్క క్షణం కూడా నిలబడలేని స్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం పరిశుభ్రత లేకపోవడం మాత్రమే సమస్య కాదని అన్నారు. ఇది పరిపాలన, జవాబుదారీతనానికి సంబంధించిన అంశమని పేర్కొన్నారు.

‘భక్తి అనేది వ్యక్తిగతం. కానీ నది ప్రజలందరిదీ’ అని వేణు ఉడుగుల అన్నారు. కాళేశ్వరం ప్రస్తుత పరిస్థితికి గత ప్రభుత్వాలను నిందించడం సరికాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం దీనిపై బాధ్యత తీసుకోవాలని సూచించారు.

వేణు ఉడుగుల పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాళేశ్వరం ప్రాంతాన్ని వెంటనే శుభ్రం చేయాలని నెటిజన్లు కోరుతున్నారు. పవిత్ర ప్రదేశాల పరిశుభ్రతపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

వేణు ఉడుగుల ‘నీది నాది ఒకే కథ’ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆ తర్వాత రానా దగ్గుబాటి హీరోగా ‘విరాటపర్వం’ తెరకెక్కించారు. సినిమాలతో పాటు సామాజిక, రాజకీయ అంశాలపై కూడా ఆయన తరచూ తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు.
Advertisement
Venu Udugula
Kaleshwaram Project
Tollywood Director
Kaleshwaram Garbage Issue
Telangana Government
Virata Parvam Director

More Telugu News