బరువు తగ్గాలనుకుంటున్నారా? ఆకలేస్తే ఈ 10 స్నాక్స్ ట్రై చేయండి!
- బరువు తగ్గాలంటే స్నాక్స్ పూర్తిగా మానాల్సిన అవసరం లేదంటున్న నిపుణులు
- మసాలా మజ్జిగలో ప్రోటీన్.. దీంతో ఎక్కువ సేపు కడుపు నిండిన భావన
- చిలగడదుంపతో తీపి కోరికకు చెక్ పెట్టడంతో పాటు కాంప్లెక్స్ కార్బ్స్
- పరిమితంగా తీసుకుంటే పనీర్, డార్క్ చాక్లెట్, పీనట్ బటర్ కూడా మంచివే
- వేయించిన పనీర్ ముక్కలు, పుచ్చకాయ, నట్స్ కూడా మంచివే!
బరువు తగ్గాలంటే స్నాక్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. భోజనాల మధ్య ఎక్కువ గ్యాప్ వస్తే మరింత ఆకలి వేయొచ్చు. దీంతో తర్వాతి భోజనంలో ఎక్కువగా తినే అవకాశం ఉంటుంది. అందుకే ఆకలిని అదుపులో ఉంచే స్నాక్‌ను ఎంచుకోవడం ముఖ్యం. ఎన్డీటీవీ కథనం ప్రకారం.. పోషకాహార నిపుణురాలు లవ్‌నీత్ బాత్రా 10 స్నాక్స్ సూచించారు. అవేంటో చూద్దాం.
1. మసాలా మజ్జిగ: ఈ లిస్ట్‌లో మసాలా మజ్జిగకు మొదటి స్థానం ఇచ్చారు. ఇందులో ప్రొటీన్ ఉండటంతో ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుందని లవ్‌నీత్ బాత్రా చెబుతున్నారు.
2. కాల్చిన చిలగడదుంప: చిలగడదుంపలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. తీపి తినాలనిపించినప్పుడు కూడా ఇది మంచి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుందని నిపుణురాలు సూచించారు.
3. మరమరాల చాట్: మరమరాలతో తయారు చేసే చాట్ పెద్ద పరిమాణంలో తిన్నా కేలరీలు ఎక్కువగా చేరకుండా చూసుకోవచ్చని ఆమె చెబుతున్నారు. ఇందులో కూరగాయలు కలిపితే మరింత పోషకాహారంగా మారుతుంది.
4. కూరగాయలు.. శనగల పేస్ట్: కీర, క్యారెట్ వంటి కూరగాయల ముక్కలను శనగలతో తయారు చేసిన పేస్ట్ (హమ్మస్)తో కలిపి తినొచ్చు. కూరగాయల నుంచి ఫైబర్, శనగల పేస్ట్ నుంచి ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయి. తేలికగా ఉండే ఈ స్నాక్ ఆకలిని కొంతసేపు అదుపులో ఉంచుతుంది.
5. వేయించిన పనీర్ ముక్కలు: కాస్త ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండే స్నాక్ కావాలంటే పనీర్ ముక్కలను తేలికగా వేయించి తీసుకోవచ్చు. పనీర్ ఆకలిని అదుపులో ఉంచడంలో బాగా ఉపయోగపడుతుందని బాత్రా చెబుతున్నారు. అయితే పరిమాణం ఎక్కువ కాకుండా చూసుకోవాలి.
6. పుచ్చకాయ: వేసవిలో పుచ్చకాయ మంచి రిఫ్రెషింగ్ స్నాక్. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో శరీరానికి హైడ్రేషన్ అందుతుంది. అయితే ఇది ఎక్కువసేపు కడుపు నిండిన భావన ఇవ్వకపోవచ్చు.
7. ప్రొటీన్ బార్: పనిలో బిజీగా ఉన్నప్పుడు లేదా బయటకు వెళ్లేటప్పుడు ప్రొటీన్ బార్ సులభమైన ఆప్షన్. అయితే కొనుగోలు చేసే ముందు లేబుల్ చూడాలి. ముఖ్యంగా అదనంగా కలిపిన చక్కెర ఎంత ఉందో పరిశీలించాలి.
8. పీనట్ బటర్: పీనట్ బటర్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అయితే ఇందులో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆరోగ్యకరమైనదే కదా అని ఎక్కువగా తినకుండా పరిమాణాన్ని నియంత్రించాలి.
9. డార్క్ చాక్లెట్: తీపి తినాలనే కోరిక వచ్చినప్పుడు డార్క్ చాక్లెట్ తీసుకోవచ్చు. అయితే ఎక్కువ కాకుండా రెండు ముక్కలకు పరిమితం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
10. మిక్స్‌డ్ నట్స్: బాదం, వాల్‌నట్ వంటి నట్స్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే ఒక్కసారి తినడం మొదలుపెడితే తెలియకుండానే ఎక్కువ తినే అవకాశం ఉంటుంది. అందుకే ముందుగానే కొంత పరిమాణంలో తీసుకుని తినడం మంచిది.
బరువు తగ్గే ప్రయత్నంలో స్నాక్ అంటే పూర్తిగా మానేయాల్సిన విషయం కాదు. అది ఎంత పోషకాలతో కూడినది, ఎంత పరిమాణంలో తింటున్నాం అన్నదే ముఖ్యం. ఆకలి తగ్గించడంతో పాటు క్యాలరీలను అదుపులో ఉంచే స్నాక్‌ను ఎంచుకుంటే డైట్‌ను కొనసాగించడం సులభంగా ఉంటుంది.