నా పోటీ హుజూర్‌నగర్ నుంచే.. వదంతులు నమ్మొద్దు: మంత్రి ఉత్తమ్
- వచ్చే ఎన్నికల్లో హుజూర్‌నగర్ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేసిన ఉత్తమ్
- తుంగతుర్తి నియోజకవర్గానికి మారుతున్నాననే వదంతులు నమ్మవద్దని విజ్ఞప్తి
- కాళేశ్వరం డిజైన్ లో లోపాలు ఉంటే ప్రభుత్వమే ఖర్చు భరిస్తుందని వెల్లడి
తెలంగాణ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. వచ్చే ఎన్నికల్లో తాను హుజూర్‌నగర్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. డీలిమిటేషన్ తర్వాత తుంగతుర్తికి మారవచ్చంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఈరోజు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి... తన నియోజకవర్గం మార్పుపై వస్తున్న వదంతులను ఎవరూ నమ్మవద్దని కోరారు. తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తన స్వగ్రామం తాటిపాములలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, అంతమాత్రాన అక్కడి నుంచి పోటీ చేస్తాననడం అవాస్తవమని తెలిపారు.
ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులపై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టులోని మూడు బ్యారేజీల పునరుద్ధరణలో డిజైన్‌కు సంబంధించిన లోపాలుంటే, ఆ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. అయితే, నిర్మాణ ఏజెన్సీల పరిధిలోకి వచ్చే సమస్యలు ఏవైనా ఉంటే, వాటిని ఆయా సంస్థలే సొంత ఖర్చుతో సరిచేయాల్సి ఉంటుందని ఆయన వివరించారు.