యూపీలో కాంగ్రెస్‌కు 50 సీట్లు కూడా ఎక్కువే: సమాజ్‌వాదీ ఎంపీ శివ్‌పాల్ సింగ్ పటేల్
- యూపీలో సీట్ల పంపకాలపై ఎస్పీ, కాంగ్రెస్ మధ్య రాజుకున్న వేడి
- ప్రస్తుతం కాంగ్రెస్‌కు ఇద్దరు ఎమ్మెల్యేలే ఉన్నారన్న ఎస్పీ ఎంపీ శివ్‌పాల్ సింగ్
- సీట్ల పంపకాలపై అక్టోబర్‌లో జరిగే చర్చల్లో అఖిలేశ్‌దే తుది నిర్ణయమని వెల్లడి
- పొత్తు వల్ల కాంగ్రెస్‌కే అధిక ప్రయోజనమని వ్యాఖ్య
- 150 సీట్లు కావాలంటూ ఇప్పటికే తమ మనోగతాన్ని బయటపెట్టిన కాంగ్రెస్
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకంపై మాటల యుద్ధం మొదలైంది. కాంగ్రెస్ కనీసం 150 స్థానాల్లో పోటీ చేయాలని చెబుతుండగా.. 50 సీట్లు కూడా ఎక్కువేనని ఎస్పీ ఎంపీ శివ్‌పాల్ సింగ్ పటేల్ అన్నారు. కాంగ్రెస్ తన బలాన్ని బట్టి సీట్లు కోరాలని సూచించారు.
కాంగ్రెస్‌కు 50 సీట్లు ఇస్తేనే పెద్ద విషయమని పటేల్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని గుర్తు చేశారు. రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే కాంగ్రెస్‌కు ప్రయోజనం ఉంటుందని అన్నారు.
కాంగ్రెస్ మాత్రం 150 సీట్లకు తగ్గకుండా పోటీ చేయాలని ఇప్పటికే తన వైఖరిని స్పష్టం చేసింది. యూపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి రాజేంద్ర పాల్ గౌతమ్ ఈ విషయాన్ని ఇటీవల ప్రకటించారు. 403 అసెంబ్లీ స్థానాల్లో సగం సీట్లపై తమకు హక్కు ఉందని ఆయన పేర్కొన్నారు. సీట్ల పంపకంపై చర్చలు అక్టోబర్‌లో జరిగే అవకాశం ఉంది.
సీట్ల విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోతే పొత్తు ఉద్దేశమే దెబ్బతింటుందని పటేల్ అన్నారు. తుది నిర్ణయం ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తీసుకుంటారని చెప్పారు.
కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ మాత్రం తమ పార్టీ నాయకత్వం తీసుకునే నిర్ణయానికే కట్టుబడి ఉంటామని తెలిపారు. ఎస్పీ, కాంగ్రెస్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో కలిసి పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో ఎస్పీ 37, కాంగ్రెస్ 6 లోక్‌సభ స్థానాలు గెలిచాయి.