రోహిత్ శర్మ చరిత్ర.. వన్డేల్లో ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్!
- ఒకే దేశంలో 200 వన్డే సిక్సర్లు కొట్టిన బ్యాటర్
- ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్ హిట్‌మ్యాన్
- వన్డేల్లో 12 వేల పరుగులు పూర్తి చేసిన రోహిత్
- 12 వేల పరుగుల క్లబ్‌లో మూడో భారతీయుడు
- 282 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ మైలురాయి
భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ మరో అరుదైన ఘనత సాధించాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఒకే దేశంలో 200 సిక్సర్లు బాదిన తొలి బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. బుధవారం గువాహటిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో ఈ మైలురాయిని అందుకున్నాడు.
406 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ ఛేదిస్తున్న సమయంలో రోహిత్ తనదైన పవర్ హిట్టింగ్‌తో విరుచుకుపడ్డాడు. బంతిని బౌండరీ దాటిస్తూ సిక్సర్ల మోత మోగించాడు. దీంతో ఒకే దేశంలో అత్యధిక వన్డే సిక్సర్లు బాదిన బ్యాటర్ల జాబితాలో రోహిత్ 200 సిక్సర్లతో అగ్రస్థానానికి చేరాడు.
ఇప్పటివరకు ఈ జాబితాలో రెండో స్థానంలో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ ఉన్నాడు. ఒకే దేశంలో తన వన్డే కెరీర్‌లో గేల్ 147 సిక్సర్లు బాదాడు.
12 వేల పరుగుల క్లబ్‌లో రోహిత్
రోహిత్ శర్మ మరో భారీ మైలురాయిని కూడా అందుకున్నాడు. వన్డేల్లో 12,000 పరుగులు పూర్తి చేసిన మూడో భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఈ ఘనతతో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ సరసన రోహిత్ చేరాడు.
39 ఏళ్ల రోహిత్ 282 ఇన్నింగ్స్‌ల్లో 12,000 వన్డే పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. ఈ మైలురాయిని వేగంగా చేరిన బ్యాటర్లలో రోహిత్ రెండో స్థానంలో నిలిచాడు. విరాట్ కోహ్లీ 242 ఇన్నింగ్స్‌ల్లోనే 12 వేల పరుగులు పూర్తి చేశాడు. సచిన్ టెండూల్కర్ 300 ఇన్నింగ్స్‌లు తీసుకోగా.. రికీ పాంటింగ్ 314, కుమార సంగక్కర 336 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించారు.