ఏపీలో SIR గడువు పొడిగింపు.. అధికారులకు కీలక ఆదేశాలు
- అక్టోబర్ 10 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదుల పరిష్కారం
- అక్టోబర్ 16న తుది ఓటర్ల జాబితా ప్రచురణ
- అర్హులైన ఏ ఒక్క ఓటరు మిగిలిపోకూడదనే ఈ నిర్ణయం
- కొత్త తేదీలపై విస్తృత ప్రచారం చేయాలని అధికారులకు ఆదేశం
ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) కార్యక్రమ గడువును భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మరోసారి పొడిగించింది. తాజా ఉత్తర్వుల ప్రకారం, తుది ఓటర్ల జాబితాను 2026 అక్టోబర్ 16న ప్రచురించనున్నారు. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ ప్రక్రియ అక్టోబర్ 9న పూర్తి కావాల్సి ఉండగా, తాజాగా మరో వారం పాటు గడువు పెంచడం గమనార్హం.
కొత్త షెడ్యూల్ ప్రకారం, ఓటర్ల జాబితాపై అందిన అభ్యంతరాలు, ఫిర్యాదుల పరిష్కార గడువును అక్టోబర్ 10 వరకు పొడిగించారు. ఈ గడువులోగా వచ్చిన అన్ని దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులను ఈసీ ఆదేశించింది. పెండింగ్‌లో ఉన్న విచారణలు (హియరింగ్‌లు), ముఖ్యంగా నో-మ్యాపింగ్, లాజికల్ డిస్క్రిపెన్సీ కేసులు, ఫారం 6, 7, 8 దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా జాబితాలో నమోదు కాకుండా మిగిలిపోకూడదనే లక్ష్యంతో ఈ పొడిగింపు ఇచ్చినట్లు పేర్కొంది.
కాగా, 2026 జులై 31న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించిన విషయం తెలిసిందే. మారిన తేదీల వివరాలను గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలకు లిఖితపూర్వకంగా తెలియజేయాలని, మీడియా ద్వారా ప్రజలకు విస్తృతంగా ప్రచారం కల్పించాలని ఈసీ అధికారులను సూచించింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు మేఘాలయ వంటి ఇతర రాష్ట్రాల్లో కూడా ఓటర్ల జాబితా సవరణ గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది.