సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై రాధిక ఫైర్
- రివ్యూల పేరుతో వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని విమర్శ
- మంచి సినిమాలకు కూడా నెగటివ్ ప్రచారం బాధ కలిగిస్తోందని ఆవేదన
- వారిపై కఠిన చర్యలు తీసుకునే వ్యవస్థ ఉండాలని డిమాండ్
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్ల తీరుపై సీనియర్ నటి, నిర్మాత రాధికా శరత్‌కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రివ్యూల పేరుతో కొందరు చేస్తున్న వ్యాఖ్యలు హద్దులు మీరుతున్నాయని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రాధిక ఈ వ్యాఖ్యలు చేశారు.
డిజిటల్ మీడియా విస్తృతి పెరిగాక సినిమాల, నటీనటులతో పాటు వారి కుటుంబ సభ్యులపై కూడా ఇష్టానుసారంగా విమర్శలు చేయడం పరిపాటిగా మారిందని రాధిక మండిపడ్డారు. తమను ఎవరూ ప్రశ్నించరనే ధీమాతో కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్లు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం సినిమా రివ్యూల వ్యవహారం అదుపు తప్పుతోందని, ఇది ప్రపంచవ్యాప్త సమస్య అయినప్పటికీ, మన దగ్గర మరీ తీవ్రంగా ఉందని అభిప్రాయపడ్డారు.
సినిమా బాగున్నప్పటికీ, ఉద్దేశపూర్వకంగా ప్రతికూల ప్రచారం చేయడం పట్ల రాధిక ఆవేదన వ్యక్తం చేశారు. అదుపుతప్పుతున్న ఇలాంటి కంటెంట్ క్రియేటర్లను నియంత్రించేందుకు ఒక బలమైన వ్యవస్థ ఉండాలని, హద్దులు దాటి ప్రవర్తించే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.