ఏఐకి ఏఐతో శిక్షణ.. కాంట్రాక్ట్ ఉద్యోగులపై ఓపెన్‌ఏఐ చర్యలు

ఏఐకి ఏఐతో శిక్షణ.. కాంట్రాక్ట్ ఉద్యోగులపై ఓపెన్‌ఏఐ చర్యలు

OpenAI takes action against contract employees for training AI with AI
  • చాట్‌జీపీటీ మోడళ్లకు మానవ స్పందనల ఆధారంగా శిక్షణ
  • శిక్షణ ఇవ్వడం కోసం వేలాది మంది కాంట్రాక్ట్ సిబ్బందిని నియమించుకున్న ఓపెన్‌ఏఐ 
  • ఏఐకి ఏఐతోనే శిక్షణ ఇచ్చిన కొందరు కాంట్రాక్ట్ ఉద్యోగులు
చాట్‌జీపీటీ మోడళ్లకు మానవ స్పందనల ఆధారంగా శిక్షణ ఇవ్వడానికి నియమించిన కొందరు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏఐనే ఉపయోగిస్తున్నట్లు గుర్తించిన ఓపెన్‌ఏఐ, వారిపై చర్యలు తీసుకుంది. మానవులే సమీక్షించాల్సిన పనిని కృత్రిమ మేధతో చేయించడం వల్ల మోడళ్ల నాణ్యత, వైవిధ్యంపై ప్రతికూల ప్రభావం పడొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

చాట్‌జీపీటీ సమాధానాలను పరిశీలించి, వినియోగదారుల ప్రశ్నలకు మరింత సహజంగా, కచ్చితంగా స్పందించేలా శిక్షణ ఇవ్వడానికి ఓపెన్‌ఏఐ వేలాది మంది కాంట్రాక్ట్ సిబ్బందిని నియమించింది. ఈ పనికి గంటకు 50 డాలర్లు, అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.4,795 వరకు చెల్లిస్తోంది. 

ఈ ప్రక్రియలో కాంట్రాక్ట్ సిబ్బంది యూజర్ ప్రాంప్ట్‌లను చదివి, ఏఐ ఇచ్చిన స్పందన సరైనదేనా, ప్రశ్నకు సంబంధించిన అంశాలనే కలిగి ఉందా, ఉపయోగకరంగా ఉందా అన్నది అంచనా వేయాలి. ఈ మానవ ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే మోడళ్లు మెరుగైన సమాధానాలు ఇవ్వడం నేర్చుకుంటాయి.

ఏఐ తయారుచేసిన కంటెంట్‌తోనే మళ్లీ ఏఐ మోడళ్లకు శిక్షణ ఇస్తే ‘మోడల్ కొలాప్స్’ ముప్పు ఏర్పడవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకే తరహా డేటా, పదజాలం, నమూనాలు పునరావృతమవుతూ పోతే మోడల్ కొత్త కోణాలను అందుకోవడంలో వెనుకబడవచ్చు. దీంతో సమాధానాల్లో వైవిధ్యం తగ్గడం, వాస్తవ సమాచార కచ్చితత్వం దెబ్బతినడం, కాలక్రమంలో పనితీరు మందగించడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.
Advertisement
OpenAI
ChatGPT
AI Training
Contract Employees
Model Collapse
Artificial Intelligence

More Telugu News