హైదరాబాద్‌కు రాపిడో ఫుడ్ డెలివరీ.. స్విగ్గీ, జొమాటోకు పోటీగా 'ఓన్లీ'
- హైదరాబాద్‌లో 'ఓన్లీ' ఫుడ్ డెలివరీని ప్రారంభించిన రాపిడో
- జీరో కమిషన్ మోడల్‌తో రెస్టారెంట్లకు పూర్తి ప్రయోజనం
- కస్టమర్లకు ప్లాట్‌ఫామ్, సర్జ్ ఛార్జీల నుంచి మినహాయింపు
- బెంగళూరులో విజయవంతం కావడంతో హైదరాబాద్‌లో విస్తరణ
- రానున్న త్రైమాసికంలో ప్రధాన మెట్రో నగరాలకు విస్తరణ ప్రణాళిక
ప్రముఖ బైక్-ట్యాక్సీ సేవల సంస్థ రాపిడో, ఫుడ్ డెలివరీ రంగంలోకి తన వ్యాపార కార్యకలాపాలను విస్తరించింది. స్విగ్గీ, జొమాటో వంటి దిగ్గజ సంస్థలకు గట్టి పోటీనిచ్చే లక్ష్యంతో 'ఓన్లీ' (Ownly) పేరుతో హైదరాబాద్‌లో ఆహార పంపిణీ సేవలను ప్రారంభించింది. ఇప్పటివరకు బెంగళూరుకు పరిమితమైన ఈ సేవలు ఇప్పుడు నగరవాసులకు కూడా అందుబాటులోకి వచ్చాయి. వినియోగదారులు రాపిడో యాప్ ద్వారా లేదా ప్రత్యేకంగా రూపొందించిన 'ఓన్లీ' యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు.
'ఓన్లీ' అనుసరిస్తున్న వ్యాపార నమూనా ప్రస్తుత మార్కెట్‌లో ఉన్న ఇతర ఫుడ్ డెలివరీ యాప్‌లతో పోలిస్తే భిన్నంగా ఉంది. స్విగ్గీ, జొమాటోల మాదిరిగా ప్రతి ఆర్డర్‌పై రెస్టారెంట్ల నుంచి కమిషన్ వసూలు చేయకుండా, 'ఓన్లీ' పూర్తిస్థాయిలో జీరో-కమిషన్ విధానాన్ని అమలు చేస్తోంది. దీనికి బదులుగా భాగస్వామ్య రెస్టారెంట్ల నుంచి కేవలం నెలవారీ సబ్‌స్క్రిప్షన్ రుసుమును మాత్రమే వసూలు చేస్తుంది. దీనివల్ల ఆర్డర్ ద్వారా లభించే పూర్తి ఆదాయాన్ని రెస్టారెంట్లే ఉంచుకోవచ్చు. మరోవైపు కస్టమర్లకు కూడా మెనూ ధర, డెలివరీ ఛార్జీలు మినహా ప్యాకేజింగ్ ఫీజులు, ప్లాట్‌ఫామ్ ఫీజులు, సర్జ్ ఛార్జీలు వంటి అదనపు ఆర్థిక భారం ఉండదని కంపెనీ స్పష్టం చేసింది. ఈ పంపిణీ సేవల కోసం రాపిడో తన ప్రస్తుత 'కెప్టెన్' (రైడర్) నెట్‌వర్క్‌నే వినియోగించుకోనుంది.
బెంగళూరులో ఇప్పటికే ఈ సేవలు విశేష ఆదరణ పొందాయి. ఇప్పటివరకు 22,000 రెస్టారెంట్లతో భాగస్వామ్యం కుదుర్చుకుని, 42 లక్షల ఆర్డర్లను పూర్తి చేసినట్లు 'ఓన్లీ' తెలిపింది.
ఈ సందర్భంగా రాపిడో సహ-వ్యవస్థాపకుడు అరవింద్ శంకా మాట్లాడుతూ, బెంగళూరులో లభించిన విజయం తమకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో బలమైన ఫుడ్ కల్చర్ ఉన్నందున ఇక్కడ కూడా తమ సేవలు విజయవంతం అవుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రానున్న త్రైమాసికం (2026 అక్టోబర్) నుంచి దేశంలోని అన్ని ప్రధాన మెట్రో నగరాలకు 'ఓన్లీ' సేవలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వివరించారు.