సీఎస్‌కే హెడ్ కోచ్‌గా నియమితుడయ్యాక తొలిసారిగా స్పందించిన జహీర్ ఖాన్
- చెన్నై సూపర్ కింగ్స్ నూతన హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్ నియామకం
- స్టీఫెన్ ఫ్లెమింగ్ స్థానాన్ని భర్తీ చేయడం సవాల్‌తో కూడుకున్నదని వ్యాఖ్య
- ధోనీ, ఫ్రాంచైజీ యాజమాన్యం తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు
- చెన్నైలోని ఎంఆర్‌ఎఫ్ పేస్ ఫౌండేషన్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న జహీర్
- అభిమానుల ప్రేమ చూస్తుంటే సొంత ఇంటికి వచ్చినట్లు అనిపిస్తోందని హర్షం
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) నూతన హెడ్ కోచ్‌గా నియమితుడైన భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ తొలిసారిగా స్పందించాడు. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన జట్టుకు కోచ్‌గా ఉండటం గౌరవంతో పాటు అతిపెద్ద బాధ్యత అని అన్నాడు. సుదీర్ఘకాలం కోచ్‌గా పనిచేసిన స్టీఫెన్ ఫ్లెమింగ్ వంటి దిగ్గజం స్థానాన్ని భర్తీ చేయడం సవాలుతో కూడుకున్నదని, అదే సమయంలో ఆసక్తికరంగా ఉంటుందని పేర్కొన్నాడు. 2027 ఐపీఎల్ సీజన్‌కు గాను జహీర్‌ను సీఎస్‌కే హెడ్ కోచ్‌గా నియమించిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా ఫ్రాంచైజీ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌తో జహీర్ మాట్లాడుతూ, "ఇప్పుడు నేను సీఎస్‌కే హెడ్ కోచ్ ను. ఈ ఫీలింగ్ కు ఇంకా అలవాటు పడుడుతున్నాను. అభిమానులు, శ్రేయోభిలాషుల నుంచి ఎంతో ప్రేమ, ఆప్యాయత అందుతోంది. నా కెరీర్‌లో ఈ కొత్త అధ్యాయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. సీఎస్‌కేకు గొప్ప చరిత్ర, వారసత్వం ఉన్నాయి. అలాంటి జట్టుకు ప్రాతినిధ్యం వహించడం ఒత్తిడితో కూడుకున్నదే. భారీ అంచనాలను అందుకోవడం సవాలుతో కూడుకున్నది, కానీ నేను దానికి సిద్ధంగా ఉన్నాను" అని తెలిపాడు.
తన నియామక ప్రక్రియ చాలా సరళంగా, సూటిగా జరిగిందని జహీర్ వివరించాడు. "సీఎస్‌కేలో ధోనీ ఒక గొప్ప శక్తి. జట్టు ప్రయాణించాల్సిన దిశను నిర్దేశించడంలో అతడి పాత్ర కీలకం. ఫ్రాంచైజీ ఓనర్లు, సీఈవో కాశీ విశ్వనాథన్ నాతో మాట్లాడారు. మీకు ఆసక్తి ఉందా, అందుబాటులో ఉంటారా అని అడిగారు. ఇది నాకు దక్కిన గౌరవంగా భావించి వెంటనే అంగీకరించాను. నా సామర్థ్యంపై వారు ఉంచిన నమ్మకం నాకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తోంది" అని అన్నాడు.
ఫ్లెమింగ్, ధోనీల భాగస్వామ్యం గురించి జహీర్ ప్రశంసలు కురిపించాడు. "వారి మధ్య ఉన్న సమన్వయం, స్థిరత్వం చాలా ప్రత్యేకమైనవి. వారి వల్లే సీఎస్‌కే ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన టీ20 ఫ్రాంచైజీలలో ఒకటిగా నిలిచింది. వారు నిర్మించిన బ్రాండ్ ఆఫ్ క్రికెట్‌ను కాపాడటంతో పాటు, దానిని ముందుకు తీసుకెళ్లడమే నా ముందున్న లక్ష్యం" అని జహీర్ పేర్కొన్నాడు.
చెన్నైతో తనకున్న పాత అనుబంధాన్ని కూడా జహీర్ గుర్తుచేసుకున్నాడు. "నా కెరీర్ తొలినాళ్లలో చెన్నైలోని ఎంఆర్‌ఎఫ్ పేస్ ఫౌండేషన్‌లో ఆస్ట్రేలియా దిగ్గజం డెన్నిస్ లిల్లీ వద్ద దాదాపు మూడేళ్లు శిక్షణ పొందాను. అప్పట్లో అన్నా నగర్‌లో ఉంటూ చెన్నైలో లీగ్ క్రికెట్ కూడా ఆడాను. అందుకే ఈ నగరంతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. సీఎస్‌కేకు రావడం సొంత ఇంటికి వచ్చినట్లుగా అనిపిస్తోంది" అని అన్నాడు. అభిమానుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే సరైన చోటుకే వచ్చాననిపిస్తోందని, చెపాక్ స్టేడియంలో వారి ప్రేమను ప్రత్యక్షంగా చూసేందుకు ఎదురుచూస్తున్నానని జహీర్ ముగించాడు.