ఐఫోన్‌ 18 ప్రో డిస్‌ప్లేలో గ్రీన్‌ లైన్లు? వీడియోలు, ఫొటోలు వైరల్‌!

ఐఫోన్‌ 18 ప్రో డిస్‌ప్లేలో గ్రీన్‌ లైన్లు? వీడియోలు, ఫొటోలు వైరల్‌!

iPhone 18 Pro Display Green Lines Videos and Photos Viral
  • గులాబీ, ఎరుపు రంగు గీతలూ వస్తున్నట్లు ఫిర్యాదులు
  • భారత్‌లోనూ కనిపించిన ఇలాంటి పోస్టులు
  • సమస్య విస్తృతంగా ఉన్నట్లు లేని ఆధారాలు
  • శాంసంగ్‌ డిస్‌ప్లే వల్లే అంటూ యూజర్ల సెటైర్లు
  • యాపిల్‌ నుంచి ఇంకా రాని అధికారిక స్పందన
కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్‌ 18 ప్రో, ఐఫోన్‌ 18 ప్రో మ్యాక్స్‌ డిస్‌ప్లేలపై కొన్ని ఫిర్యాదులు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోన్ల స్క్రీన్‌పై ఆకుపచ్చ, గులాబీ, ఎరుపు రంగుల్లో నిలువు గీతలు కనిపిస్తున్నట్లు కొన్ని వీడియోలు, ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. సమస్యపై యాపిల్‌ను సంప్రదించిన తర్వాత కొందరికి ఫోన్లు రీప్లేస్‌ చేసినట్లు యూజర్లు చెబుతున్నారు. భారత్‌తో పాటు ఇతర మార్కెట్లలోనూ ఇలాంటి పోస్టులు కనిపిస్తున్నాయి. అయితే ఎంతమంది ఫోన్లలో ఈ సమస్య వచ్చిందన్న దానిపై స్పష్టత లేదు.

ప్రస్తుతం ఈ డిస్‌ప్లే సమస్య విస్తృతంగా ఉందని చెప్పడానికి ఆధారాలు లేవు. అలాగే ఏదైనా నిర్దిష్ట హార్డ్‌వేర్‌ భాగం వల్లే ఇలా జరుగుతోందని నిర్ధారణ కాలేదు. యాపిల్‌ కూడా ఈ ఫిర్యాదులపై అధికారికంగా స్పందించలేదు. ఇదే సమయంలో కొందరు యూజర్లు ఈ సమస్యను శాంసంగ్‌ డిస్‌ప్లేలతో ముడిపెడుతూ సోషల్‌ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.

యాపిల్‌ హైఎండ్‌ ఐఫోన్ల కోసం శాంసంగ్‌ డిస్‌ప్లే నుంచి ఎల్‌టీపీఓ+ ఓఎల్‌ఈడీ ప్యానెళ్లను తీసుకుంటోంది. డ్రైవర్‌ యూనిట్‌లో ఆక్సైడ్‌ టెక్నాలజీని ఉపయోగించే ఈ ప్యానెళ్లను మెరుగైన పవర్‌ ఎఫిషియెన్సీ కోసం రూపొందించారు. అయితే శాంసంగ్‌ డిస్‌ప్లేలు వాడుతున్నందుకే ప్రస్తుత సమస్య వచ్చిందని చెప్పడానికి ఎలాంటి ఆధారం లేదు. గతంలోనూ ఐఫోన్‌ ఎక్స్‌, ఐఫోన్‌ 13, ఐఫోన్‌ 14 ప్రో వంటి పలు ఫోన్లలో స్క్రీన్‌పై గ్రీన్‌ లైన్‌ సమస్యలపై యూజర్లు ఫిర్యాదు చేసినట్టు వార్తలు వచ్చాయి.

యాపిల్‌ కొత్త ఐఫోన్లను సెప్టెంబర్‌ 9న విడుదల చేసింది. భారత్‌లో సెప్టెంబర్‌ 18న విక్రయాలు ప్రారంభమయ్యాయి. ధరలు పెరిగినప్పటికీ లాంచ్‌ సమయంలో అమ్మకాలపై స్పందన బాగుందని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ తెలిపింది. భారత్‌లో ఐఫోన్‌ 18 ప్రో 256GB మోడల్‌ ధర రూ.1,64,900 నుంచి ప్రారంభమవుతోంది. ఐఫోన్‌ 18 ప్రో మ్యాక్స్‌ 256GB ధర రూ.1,74,900 నుంచి ఉంది. అర్హత ఉన్న కార్డ్‌ ఈఎంఐ లావాదేవీలపై రూ.7,000, పూర్తి కార్డ్‌ పేమెంట్‌పై రూ.6,000 ఇన్‌స్టంట్‌ క్యాష్‌బ్యాక్‌ను యాపిల్‌ అందిస్తోంది.
Advertisement
iPhone 18 Pro
Apple Display Issues
iPhone 18 Green Line Problem
Samsung OLED Panels
iPhone 18 Pro Max India
Smartphone Screen Defects

More Telugu News