హెయిర్‌కట్ తర్వాత ఈ మసాజ్ వద్దు.. నరాలు దెబ్బతినే ప్రమాదం!
- మెడ క్రాకింగ్‌తో రక్తనాళాలకు గాయమయ్యే ప్రమాదం
- తీవ్రమైన సందర్భాల్లో స్ట్రోక్ వచ్చే అవకాశం
- నరాలు దెబ్బతింటే పక్షవాతం రావచ్చంటున్న నిపుణులు
- శ్వాస నరం దెబ్బతినే ప్రమాదం
- లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లడం మేలు
హెయిర్‌కట్ అయిపోయింది.. ఇక మెడ మసాజ్! కాసేపు అలా మెడను తిప్పి ‘కట్.. కట్’ అనే శబ్దం వచ్చేలా చేస్తే ఏదో రిలీఫ్ వచ్చినట్లు అనిపిస్తుంది. చాలామంది దీన్ని హెయిర్‌కట్‌లో భాగంగానే భావిస్తారు. కానీ అదే సరదా.. ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చే ప్రమాదం ఉందని న్యూరోసర్జన్లు హెచ్చరిస్తున్నారు. మెడను ఒక్కసారిగా బలంగా తిప్పడం వల్ల రక్తనాళాలు, నరాలు, వెన్నుపూసకు తీవ్ర గాయాలు కావచ్చని చెబుతున్నారు.
సరదాగా మొదలై.. స్ట్రోక్‌కు దారితీయొచ్చు
మన మెడలో మెదడుకు రక్తాన్ని తీసుకెళ్లే వెర్టీబ్రల్ ఆర్టరీలు ఉంటాయి. మెడను వేగంగా, బలంగా తిప్పితే ఈ రక్తనాళాల గోడలకు చీలిక వచ్చే ప్రమాదం ఉంది. అక్కడ రక్తం గడ్డకట్టొచ్చు. ఆ గడ్డ మెదడుకు రక్తప్రసరణను అడ్డుకుంటే స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది వెంటనే రావచ్చు. కొన్ని సందర్భాల్లో రోజుల తర్వాత కూడా లక్షణాలు కనిపించొచ్చని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
నరాలు దెబ్బతింటే పరిస్థితి తీవ్రం
మెడలోని వెన్నుపాము, కీలకమైన నరాలు కూడా ప్రమాదంలో పడొచ్చు. ముఖ్యంగా శ్వాసకు ఉపయోగపడే ఫ్రెనిక్ నరం దెబ్బతింటే శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు రావచ్చు. కొన్ని సందర్భాల్లో డయాఫ్రమ్ పనిచేయక వెంటిలేటర్ అవసరం పడే పరిస్థితి కూడా రావచ్చు.
మెడలో ఇప్పటికే డిస్క్ సమస్యలు, ఎముకల బలహీనత ఉన్నవారికి ప్రమాదం మరింత ఎక్కువగా ఉండొచ్చు. ఒక్కసారిగా మెడ తిప్పడం వల్ల వెన్నుపాముపై ఒత్తిడి పెరిగి చేతులు, కాళ్లలో మొద్దుబారడం లేదా పక్షవాతం వచ్చే అవకాశం ఉంది.
వయసు పెరిగినవారు మరింత జాగ్రత్త
బలంగా మెడ తిప్పడం వల్ల కండరాలు, లిగమెంట్లు కూడా దెబ్బతినొచ్చు. పదేపదే ఇలా చేయడం వల్ల మెడ కీళ్లలో అస్థిరత, నొప్పి, కండరాలు పట్టేయడం వంటి సమస్యలు రావచ్చు. వృద్ధుల్లో మెడ ఎముకలకు గాయాలయ్యే ప్రమాదం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ లక్షణాలు కనిపిస్తే..
హెయిర్‌కట్ తర్వాత మెడను బలంగా తిప్పించుకున్న వెంటనే ముఖం లేదా శరీరంలో ఒకవైపు తిమ్మిరి, బలహీనత, మాట తడబడటం, తల తిరగడం, చూపు మారడం, నడకలో తడబడటం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకూడదు. అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి లేదా మెడ నొప్పి వచ్చినా నిర్లక్ష్యం చేయొద్దు.
ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ తగ్గుతుందేమో చూడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ముఖ్యంగా స్ట్రోక్ చికిత్స అందుబాటులో ఉన్న ఆసుపత్రిని ఆశ్రయించడం మంచిది.
హెయిర్‌కట్ కోసం బార్బర్ దగ్గరకు వెళ్లినప్పుడు.. జుట్టు కత్తిరించమని మాత్రమే చెప్పండి. మెడను బలంగా తిప్పే మసాజ్‌ను మాత్రం వద్దని చెప్పడం సురక్షితం.