17 ఏళ్ల బాలికపై మైనర్ల రేప్ ఆపై మర్డర్.. మృతదేహాన్ని కుక్కలు పీక్కుతున్న దుస్థితి!
- నిర్మానుష్య ప్రాంతంలో బాలిక మృతదేహం
- శవం పూర్తిగా కుళ్లిపోవడంతో కష్టమైన గుర్తింపు
- అనుమానాస్పద టెంపోను సీసీటీవీ ఆధారంగా గుర్తింపు
- డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా వెలుగులోకి ఘోరం
- కత్తులు, రక్తపు మరకలున్న దుస్తుల స్వాధీనం
దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసి, కత్తులతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని స్వరూప్ నగర్‌లోని ఓ బహిరంగ ప్రదేశంలో పడేశారు. కొన్ని రోజుల తర్వాత అక్కడ మృతదేహం లభ్యమైంది.
కుషక్ రోడ్ సమీపంలోని పొలాల్లో మృతదేహం పడి ఉందని సెప్టెంబర్ 13 ఉదయం పోలీసులకు సమాచారం అందింది. మృతదేహం తీవ్రంగా కుళ్లిపోవడంతో తొలుత బాధితురాలి లింగాన్ని కూడా ఫోరెన్సిక్ బృందాలు వెంటనే నిర్ధారించలేకపోయాయి.
పోలీసుల ప్రకారం.. బాలికకు నిందితులతో ముందే పరిచయం ఉంది. వారంతా ఓ టెంపోలో కలిసి మద్యం సేవించిన తర్వాత బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మృతదేహంలో కొంత భాగాన్ని వీధి కుక్కలు తినేశాయని పోలీసులు తెలిపారు. ఓ చేయి మృతదేహానికి దూరంగా పొలంలో లభించినట్లు చెప్పారు.
బాలిక కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయలేదు. ఆమె తరచూ ఇంటి నుంచి వెళ్లి కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చేదని కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పినట్లు సమాచారం.
కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు 50కుపైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ టెంపోను గుర్తించారు. చీకటి, తక్కువ వెలుతురు కారణంగా తొలుత వాహనం నంబర్ స్పష్టంగా కనిపించలేదు. చివరకు టెంపోను ఖడ్డా కాలనీలో గుర్తించి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
డ్రైవర్‌ను విచారించగా మరో ముగ్గురి వివరాలు బయటపడ్డాయి. దీంతో 16 నుంచి 17 ఏళ్ల వయసున్న ముగ్గురు మైనర్లతో పాటు శివమ్ అలియాస్ సుదామాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించినట్లు అనుమానిస్తున్న రెండు కత్తులు, నిందితులు ధరించిన రక్తపు మరకలున్న దుస్తులను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనలో మరెవరైనా ఉన్నారా? అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని సంబంధిత సెక్షన్లతో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్ 6 కింద కేసు నమోదు చేశారు.