మసూద్ అజర్‌పై పాకిస్థాన్ రివార్డు పెంపు.. స్పందించిన భారత్
- జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌పై పాకిస్థాన్ రివార్డు పెంపు
- ఇది కపట నాటకం, బూటకపు ప్రకటన అని భారత్ తీవ్ర విమర్శ
- పాక్ ఈ గిమ్మిక్కులు చేస్తోందని ఆరోపణ
జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజర్‌పై రివార్డును పెంచుతూ పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయంపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఇదొక 'బూటకపు ప్రకటన' అని, ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న గిమ్మిక్కుగా కొట్టిపారేసింది. ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పించే పాకిస్థాన్ ఇలాంటి చర్యలకు పాల్పడటం కొత్తేమీ కాదని విమర్శించింది.
మంగళవారం విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. "ఇలాంటి గిమ్మిక్కులు, కపట నాటకాలు పాకిస్థాన్‌కు కొత్తేమీ కాదు. గతంలోనూ ఇలాంటి ధోరణులను చూశాం. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ఒక దేశం ఇలాంటి బూటకపు ప్రకటనలు చేయడం వల్ల ప్రయోజనం లేదు. కేవలం మాటలకు పరిమితం కాకుండా చేతల్లో చర్యలు చూపించినప్పుడే దానికి విలువ ఉంటుంది" అని ఆయన స్పష్టం చేశారు.
పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, తమ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల 'రెడ్ బుక్ 2026' జాబితాలో మసూద్ అజర్‌ను చేర్చింది. అతనిపై ఉన్న రివార్డును మరో 20 లక్షల పాకిస్తానీ రూపాయలు పెంచి, మొత్తం 70 లక్షలకు (భారత కరెన్సీలో సుమారు రూ. 24 లక్షలు) చేర్చింది.
వచ్చే అక్టోబర్‌లో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) ప్లీనరీ సమావేశం జరగనున్న నేపథ్యంలోనే పాకిస్థాన్ ఈ చర్యలు చేపట్టిందని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. 2022లో 'గ్రే లిస్ట్' నుంచి బయటపడినప్పటికీ, ఐక్యరాజ్యసమితి గుర్తించిన ఉగ్రవాదులపై చర్యల తీసుకునే విషయంలో పాకిస్థాన్ ఇంకా అంతర్జాతీయ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. మసూద్ అజర్ తమ దేశంలో లేడని, ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌లో ఉన్నాడని పాకిస్థాన్ వాదిస్తుండగా, భారత్ మాత్రం ఆ వాదనను పూర్తిగా ఖండిస్తోంది.