విజయ్ ఒక్క సైగతో రాజకీయ దుమారం.. స్టాలిన్‌ను బాధించిన 1976 నాటి ఆ గాయం ఏంటి?
- సీఎం విజయ్ ‘దవడ సైగ’తో రాజకీయ దుమారం
- కావాలని చేయలేదని సీఎం వివరణ
- తీవ్రంగా తప్పుబట్టటిన డీఎంకే వర్గాలు
- ఎమర్జెన్సీ సమయంలో తన దవడ ఎముకలు విరిగింది నిజమేనన్న స్టాలిన్
- సీఎం స్థాయి ఏంటో తెలుసుకొని వ్యవహరించాలని హితవు
ఒక చిన్న సైగ .. తమిళనాడు రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపింది. అసెంబ్లీలో సీఎం విజయ్ తన దవడను చేతితో పట్టుకున్న తీరు ఇప్పుడు తీవ్ర రాజకీయ వివాదానికి కారణమైంది. అది డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ను ఉద్దేశించి చేసిన ఎద్దేవా అంటూ ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. విజయ్ మాత్రం తన బాడీ లాంగ్వేజ్ అనుకోకుండా అలా వచ్చిందని, ఎవరినీ వ్యక్తిగతంగా బాధపెట్టాలన్న ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. కానీ ఈ వివాదం వెనుక దాదాపు 50 ఏళ్ల నాటి గాయం ఉంది. అదే.. 1976లో అత్యవసర పరిస్థితి సమయంలో స్టాలిన్‌కు ఎదురైన ఘటన.
అసెంబ్లీలో ఏం జరిగింది?
సెప్టెంబర్ 7న తమిళనాడు అసెంబ్లీలో విజయ్ డీఎంకే ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. పోలీసు శాఖకు సంబంధించిన గ్రాంట్లపై జరిగిన చర్చకు సమాధానమిస్తున్న సమయంలో ఆయన పలుమార్లు రాజకీయంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో తన దవడను ఒక చేత్తో పట్టుకుని పైకి లేపుతున్నట్లుగా ఓ హావభావం కనిపించింది. ఈ సైగ స్టాలిన్ దవడకు తగిలిన గాయాన్ని ఎద్దేవా చేసేలా ఉందని డీఎంకే నేతలు ఆరోపించారు. ఆ వెంటనే వివాదం ముదిరింది.
విజయ్ ఏం చెప్పారు?
విమర్శలు పెరగడంతో విజయ్ వివరణ ఇచ్చారు. అసెంబ్లీలో తన బాడీ లాంగ్వేజ్ అనుకోకుండా వచ్చిందని చెప్పారు. అది ఉద్దేశపూర్వకంగా చేసిన హావభావం కాదని స్పష్టం చేశారు. తన చర్యను ఎవరి వ్యక్తిగత భావాలను దెబ్బతీసే ప్రయత్నంగా చూడొద్దని కోరారు. అయితే అప్పటికే రాజకీయంగా నష్టం జరిగిపోయింది. డీఎంకేతో పాటు వామపక్ష నేతలు కూడా ఈ చర్యను తప్పుబట్టారు.
అసలు 1976లో ఏం జరిగింది?
ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. 1975లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రతిపక్షాలపై తీవ్ర ఆంక్షలు విధించింది. 1976లో తమిళనాడులో కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం రద్దయింది. అదే సమయంలో యువ డీఎంకే నాయకుడిగా ఉన్న స్టాలిన్‌ను అరెస్టు చేశారు.
ఆయనను ‘మీసా’ చట్టం కింద అదుపులోకి తీసుకుని మద్రాస్ జైలులో నిర్బంధించారు. మీసా అంటే ‘మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్’. విచారణ లేకుండానే వ్యక్తులను నిర్బంధించే విస్తృత అధికారాలను ఈ చట్టం ప్రభుత్వానికి ఇచ్చింది. అత్యవసర పరిస్థితి సమయంలో రాజకీయ ప్రత్యర్థులపై దీన్ని విస్తృతంగా ఉపయోగించారు.
జైలులోనే దవడకు గాయమా?
స్టాలిన్ తన ఆత్మకథ ఉంగళిల్ ఒరువన్‌లో ఆ సమయం గురించి వివరించారు. జైలు పరిస్థితులు, అక్కడ జరిగిన హింసను ప్రస్తావించారు. అప్పటి జైలు ఘటనలపై విచారణ జరిపిన జస్టిస్ ఎం.ఎం. ఇస్మాయిల్ కమిషన్ ముందు ఇచ్చిన వాంగ్మూలాల్లోనూ ఖైదీలపై తీవ్ర భౌతిక దాడుల ప్రస్తావన వచ్చింది. ఆ దాడుల్లో స్టాలిన్ దవడ విరిగినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అందుకే డీఎంకేకు ఆ గాయం కేవలం వ్యక్తిగత శారీరక గాయం కాదు. అత్యవసర పరిస్థితి నాటి అణచివేతకు గుర్తుగా పార్టీ నేతలు దాన్ని చూస్తారు. స్టాలిన్ రాజకీయ జీవితంలో ఆ ఘటనకు ప్రత్యేక స్థానం ఉంది.
మిత్రపక్షం నుంచే విజయ్‌కు ఎదురుదెబ్బ
ఈ వివాదం విజయ్ పార్టీకి మద్దతుగా ఉన్న వామపక్షాలతోనూ ఇబ్బంది తెచ్చింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. శణ్ముగం.. విజయ్ సైగను తీవ్రంగా తప్పుబట్టారు. అత్యవసర పరిస్థితి సమయంలో స్టాలిన్‌పై జరిగిన దాడిని గుర్తుచేస్తూ.. ఆయన దవడ విరిగిన ఘటనను ఎద్దేవా చేయడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. అసెంబ్లీ ప్రజా సమస్యలపై చర్చించాల్సిన వేదిక అని, వ్యక్తిగత విమర్శలకు దాన్ని ఉపయోగించడం సరికాదని శణ్ముగం అన్నారు.
స్టాలిన్ స్పందన ఇదే..
స్టాలిన్ కూడా ఈ వివాదంపై నేరుగా స్పందించారు. విజయ్‌ను ఉద్దేశించి “తమ్ముడు విజయ్.. నువ్వు చేసిన సైగ నిజమే. పోలీసుల దాడిలో నా దవడ ఎముకలు విరిగాయి. ఆ దాడి గాయాల మచ్చలు ఇప్పటికీ నా శరీరంపై ఉన్నాయి. మీ స్థాయి ఏంటో గుర్తించి అందుకు తగ్గట్టుగా వ్యవహరించాలి. మీరు ప్రభుత్వాన్ని సినిమా షూటింగ్‌లా నడుపుతున్నారు. అసెంబ్లీని రీల్స్ చేసే ప్రదేశంగా మార్చారు. మేం నిర్మించిన వంతెనను కూడా ఫొటోషూట్‌కు ఉపయోగించుకున్నారు” అంటూ స్టాలిన్ తీవ్రంగా విమర్శించారు.