భారత్ చమురు కొనేది రష్యా కోసం కాదు.. దేశం కోసమే: రష్యా
- దేశ అవసరాలకే భారత్ చమురు కొనుగోలు చేస్తోందన్న రష్యా
- భారత్‌కు ఎంత చమురు అవసరమైనా సరఫరా చేస్తామని హామీ
- పశ్చిమ దేశాల ఆంక్షలు ఒత్తిడి తంత్రాలేనని విమర్శించిన రష్యా రాయబారి
- రష్యా చమురు లేకుండా ప్రపంచ ఇంధన మార్కెట్లు నడవలేవని స్పష్టీకరణ
భారత్ తమ దేశ ప్రయోజనాలు, ఇంధన అవసరాల కోసమే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందని, అంతేకానీ మాస్కోకు సాయం చేయడానికి కాదని భారత రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో రష్యాతో వాణిజ్యంపై పశ్చిమ దేశాల నుంచి ఒత్తిడి పెరుగుతున్న తరుణంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
భారత ప్రభుత్వ రంగ ప్రసార సంస్థ ‘డీడీ ఇండియా’కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అలిపోవ్ మాట్లాడారు. "భారత్ రష్యాకు సాయం చేయాలన్న ఉద్దేశంతో చమురు కొనడం లేదు. తన ప్రజలు, దేశాభివృద్ధి కోసమే కొనుగోలు చేస్తోంది" అని ఆయన వివరించారు. భారత్‌కు ఎంత చమురు అవసరమైనా సరఫరా చేసేందుకు రష్యా కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు.
పశ్చిమ దేశాలు విధిస్తున్న ద్వితీయ శ్రేణి ఆంక్షలు, టారిఫ్‌లను ఆయన 'ఒత్తిడి తంత్రాలు'గా అభివర్ణించారు. "నిజాయతీగా సహకరించే బదులు ఈ దేశాలు ఒత్తిడి మార్గాన్ని ఎంచుకున్నాయి. అందుకే అవి భారత్‌కు మా కంటే మెరుగైన డీల్ ఇవ్వలేకపోతున్నాయి" అని ఆయన విమర్శించారు. రష్యా చమురు లేకుండా ప్రపంచ ఇంధన మార్కెట్లు సమర్థంగా పనిచేయలేవని, భారత్‌తో పాటు ఇతర దేశాలకు రష్యా చమురు అందుబాటులో ఉంటుందని అలిపోవ్ అన్నారు.
2022లో జీ7, యూరోపియన్ యూనియన్ రష్యా ఇంధనంపై ధరల పరిమితి విధించిన తర్వాత భారత్ ఆ దేశం నుంచి చమురు దిగుమతులను గణనీయంగా పెంచుకుంది. ఈ వాణిజ్యం కేవలం భారత్ అభివృద్ధి ప్రాధాన్యతలకు అనుగుణంగా సాగుతున్న వాణిజ్య ఒప్పందమేనని ఇరు దేశాలు స్పష్టం చేస్తున్నాయి.