గంటల తరబడి మొబైల్ చూస్తున్నారా? మీ వెన్నెముకకు ముప్పు పొంచి ఉంది!
- గంటల తరబడి తల వంచడం మెడ, వెన్నెముకపై ఒత్తిడి
- దీని వల్ల ‘టెక్స్ట్ నెక్’, భుజాల బిగుతు, తలనొప్పి వచ్చే ఛాన్స్
- నొప్పి చేతులకు పాకడం, తిమ్మిరి వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు
- ల్యాప్‌టాప్, మొబైల్‌ను కళ్ల స్థాయికి దగ్గరగా ఉంచుకోవాలని నిపుణుల సూచన
- ప్రతి 20 నిమిషాలకు చిన్న విరామం తీసుకోవడం మంచిదని సలహా
మొబైల్ చేతిలో ఉందా? తల కిందికి వంచి స్క్రోల్ చేస్తున్నారా? ల్యాప్‌టాప్ ముందు గంటల తరబడి కూర్చుంటున్నారా? అయితే కేవలం కళ్లు మాత్రమే కాదు.. మీ మెడ, వెన్నెముక కూడా మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చు. రోజూ గంటల తరబడి ఇదే అలవాటు కొనసాగితే నొప్పి నుంచి దీర్ఘకాలిక సమస్యల వరకు దారి తీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మనిషి తల సాధారణంగా 10 నుంచి 12 పౌండ్ల బరువు ఉంటుంది. తలను ముందుకు వంచినప్పుడు మెడ కండరాలు, వెన్నెముకపై పడే ఒత్తిడి మరింత పెరుగుతుంది. ఇదే భంగిమలో ఎక్కువసేపు ఉంటే మెడ, భుజాల్లో బిగుతు, నొప్పి మొదలవుతాయి. క్రమంగా ఇది ‘టెక్స్ట్ నెక్’ సమస్యకు దారి తీస్తుంది.
గంటల తరబడి మొబైల్, ల్యాప్‌టాప్ వాడే ఉద్యోగుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపించే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. మెడను నిరంతరం ముందుకు వంచడం వల్ల మెడ, వెన్నెముకకు మద్దతిచ్చే కండరాలు ఎక్కువగా పనిచేయాల్సి వస్తుందని చెప్పారు.
దీని వల్ల మెడ, భుజాల్లో బిగుతు, కండరాల అలసట, తలనొప్పి, దీర్ఘకాలిక నొప్పి రావచ్చని తెలిపారు. కొందరిలో నొప్పి చేతులకు పాకడం, జలదరింపు, తిమ్మిరి, బలహీనత వంటి లక్షణాలు కనిపించవచ్చని హెచ్చరించారు.
స్క్రీన్‌ను కళ్ల స్థాయికి దగ్గరగా ఉంచుకోవడం వల్ల మెడపై ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ల్యాప్‌టాప్ వాడేటప్పుడు ల్యాప్‌టాప్ స్టాండ్‌తో పాటు ప్రత్యేక కీబోర్డ్, మౌస్ వాడటం మంచిదని చెబుతున్నారు. మొబైల్ చూసేటప్పుడు తలను కిందికి వంచకుండా ఫోన్‌ను కళ్ల స్థాయికి తీసుకురావాలని సూచిస్తున్నారు.
ప్రతి 20 నిమిషాలకోసారి చిన్న విరామం తీసుకోవాలి. 20 సెకన్ల పాటు సుమారు 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును చూడాలి. క్రమం తప్పకుండా వ్యాయామం, స్ట్రెచింగ్, యోగా చేయడం కూడా ఉపయోగకరమని నిపుణులు చెబుతున్నారు. నొప్పి పదేపదే వస్తున్నా, రోజురోజుకూ పెరుగుతున్నా నిర్లక్ష్యం చేయకుండా వైద్య నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నారు.