కాకినాడ నర్సింగ్ కాలేజీలో విద్యార్థినుల ఫైట్.. పలువురికి గాయాలు
- సెల్‌ఫోన్ పోయిందన్న ఫిర్యాదుతో మొదలైన వివాదం
- రోడ్డుపైకి వచ్చి దాడి చేసుకున్న ఏపీ, మణిపూర్ విద్యార్థినులు
- అధికారుల జోక్యంతో సద్దుమణిగిన గొడవ
- మణిపూర్ విద్యార్థినులను మరో హాస్టల్‌కు తరలింపు
ఓ సెల్‌ఫోన్ వ్యవహారం నర్సింగ్ విద్యార్థినుల మధ్య పెద్ద ఘర్షణకు దారితీసింది. కాకినాడలోని ఎస్‌కే కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో చదువుకుంటున్న ఆంధ్రప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాలకు చెందిన విద్యార్థినులు రోడ్డుపైకి వచ్చి పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. అధికారుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది.
వివరాల్లోకి వెళితే.. కళాశాల హాస్టల్‌లో ఉంటున్న మణిపూర్‌కు చెందిన ఓ విద్యార్థిని తన సెల్‌ఫోన్ కనిపించడం లేదని ఇటీవల సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఫోన్ దొరికినప్పటికీ, ఈ విషయంపై విద్యార్థినుల మధ్య వివాదం సద్దుమణగలేదు. మాటామాటా పెరిగి పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. రెండు వర్గాల విద్యార్థినులు హాస్టల్ నుంచి బయటకు వచ్చి రోడ్డుపైనే ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ దాడిలో పలువురు విద్యార్థినులకు స్వల్ప గాయాలవగా, ఇద్దరిని చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే కళాశాల వద్దకు చేరుకున్నారు. ఆర్డీవో, ట్రైనీ జేసీ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా సంఘటనా స్థలానికి వచ్చి విద్యార్థినులతో మాట్లాడారు. వారికి నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
అధికారులు తక్షణ చర్యగా మణిపూర్‌కు చెందిన విద్యార్థినులను వేరే హాస్టల్‌కు తరలించారు. ఈ ఘటన నేపథ్యంలో అసలు కళాశాలకు సరైన అనుమతులు ఉన్నాయా, విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు ఎలా ఉన్నాయి అనే కోణంలో అధికారులు విచారణ ప్రారంభించారు.