ఈజిప్టు మమ్మీల రహస్యం.. మనుషులనే కాదు, మొసళ్లను కూడా మమ్మీలుగా మార్చేశారు!
- ఈజిప్టులోని మొసళ్ల మమ్మీలపై ఆధునిక డీఎన్ఏ పరీక్షలు
- అవి నైలు మొసళ్లు కాదు, పశ్చిమాఫ్రికా జాతివని గుర్తింపు
- సోబెక్ దేవుడికి మొక్కుబడిగా ఈ మమ్మీలను సమర్పించిన ఈజిప్షియన్లు
ప్రాచీన ఈజిప్టుకు చెందిన వేల ఏళ్ల నాటి రహస్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రాచీన ఈజిప్టు వాళ్లు మనుషులనే కాదు, మొసళ్లను కూడా మమ్మీలుగా మార్చేసేవారు. ముఖ్యంగా కామ్ ఒంబో దేవాలయం వద్ద సోబెక్ అనే మొసలి దేవుడికి అర్పించేందుకు వేలాది మొసళ్లను మమ్మీలుగా చేసి పూజించేవారు.
తాజాగా మొసళ్ల మమ్మీలపై జరిపిన ఒక పరిశోధనలో ఈ ఆశ్చర్యకరమైన విషయం వెల్లడైంది. సోబెక్ దేవుడికి మొక్కుబడిగా సమర్పించిన ఈ మొసళ్ల మమ్మీలు, ప్రాచుర్యంలో ఉన్నట్లుగా నైలు నది మొసళ్లు కావని, అవి పశ్చిమాఫ్రికా మొసలి జాతికి చెందినవని డీఎన్ఏ విశ్లేషణలో స్పష్టమైంది.
ప్రాచీన ఈజిప్షియన్లు మొసలి తల కలిగిన సోబెక్ దేవుడిని నైలు నదికి, సంతానోత్పత్తికి మరియు రాజరిక శక్తికి చిహ్నంగా ఆరాధించేవారు. అస్వాన్ సమీపంలోని కొమ్ ఒంబో ఆలయాన్ని సందర్శించే భక్తులు, చిన్నపిల్లల నుంచి భారీ పరిమాణంలో ఉండే మొసళ్ల వరకు మమ్మీలుగా భద్రపరిచి దేవుడికి కానుకగా సమర్పించేవారు. అయితే, ఈ మొసళ్లను ఆలయ ప్రాంగణాల్లోనే ప్రత్యేకంగా పెంచారా లేదా అడవి నుంచి వేటాడి తీసుకువచ్చారా అనే అంశంపై సుదీర్ఘ కాలంగా చర్చ నడుస్తోంది.
"ది సీక్రెట్స్ ఆఫ్ సోబెక్" పేరిట నిర్వహించిన అధ్యయనంలో భాగంగా, ఒక మొసలి మమ్మీ నుంచి సేకరించిన మైటోకాండ్రియల్ డీఎన్ఏను విశ్లేషించారు. ప్రాచీన ఈజిప్టులో ఒకటి కంటే ఎక్కువ మొసళ్ల జాతులు మనుగడలో ఉండేవనే చారిత్రక ఆధారాలకు ఈ ఫలితాలు మరింత బలాన్ని చేకూర్చాయి. పర్యావరణ మార్పుల వల్ల ప్రస్తుతం అక్కడ ఆ జాతులు అంతరించిపోయినప్పటికీ, ఆ కాలంలో పశ్చిమాఫ్రికా మొసళ్లు కూడా నైలు నది పరిసరాల్లో సహజంగానే జీవించి ఉండవచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు, మరొక మమ్మీపై నిర్వహించిన హై-రిజల్యూషన్ ఇమేజింగ్ పరీక్షల్లో, దాని కడుపులోని ఆహార అవశేషాలు మరియు శరీర గాయాలను విశ్లేషించగా, అది అడవిలో జీవించినట్లు ఆధారాలు లభించాయి. దీనిని బట్టి కొన్ని మొసళ్లను అడవిలో వేటాడి, అనంతరం మమ్మీలుగా మార్చినట్లు స్పష్టమవుతోంది. ఈ మమ్మీలు కేవలం మతపరమైన ఆచారాల్లో భాగమే కాకుండా, 2,000 ఏళ్ల నాటి జీవవైవిధ్యం, పర్యావరణ మార్పులు మరియు అప్పటి మత విశ్వాసాలను ప్రతిబింబించే కీలక చారిత్రక ఆధారాలని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.