శంకర్ కుమార్తె అదితి కొత్త చిత్రం 'వన్స్ మోర్'... ఆగస్టు 28న గ్రాండ్ రిలీజ్!
- అర్జున్ దాస్, అదితి శంకర్ జంటగా 'వన్స్ మోర్'
- రిలీజ్ డేట్ ఫిక్స్
- విఘ్నేశ్ శ్రీకాంత్ దర్శకత్వంలో చిత్రం
- 'హృదయం', 'హాయ్ నాన్న' ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం
- మిలియన్ డాలర్ స్టూడియోస్ పతాకంపై యువరాజ్ గణేశన్ నిర్మాణం
ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న అదితి శంకర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం 'వన్స్ మోర్'. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ రొమాంటిక్ డ్రామా విడుదల తేదీని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అర్జున్ దాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్టు వెల్లడించింది.
విఘ్నేశ్ శ్రీకాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా విడుదల తేదీ ప్రకటనతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మిలియన్ డాలర్ స్టూడియోస్ తమ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని పంచుకుంది. "పండగ రోజు ఇదే. నిరీక్షణకు తెరపడి ప్రేమ మొదలయ్యే చోటు. మా ప్రేమ క్యాలెండర్‌లో ఇష్టమైన తేదీ దొరికింది. 'వన్స్ మోర్' ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది" అని పోస్ట్ చేసింది.
ఈ సినిమాకు పలు ఆకర్షణలు ఉన్నాయి. ముఖ్యంగా, మలయాళంలో 'హృదయం', తెలుగులో 'హాయ్ నాన్న' వంటి చిత్రాలతో చార్ట్‌బస్టర్ ఆల్బమ్స్ అందించి సంచలనం సృష్టించిన ప్రముఖ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్, ఈ సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన కొన్ని పాటలు సంగీత ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.
అర్జున్ దాస్, అదితి శంకర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో మోడల్, నటి సోనా ఒలికల్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, నాష్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. రాజ్ కమల్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. మిలియన్ డాలర్ స్టూడియోస్ పతాకంపై యువరాజ్ గణేశన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హరీశ్ దురైరాజ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, విజయ్ ఎంపీ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.