టీమిండియాలో కలకలం.. కోచ్ గౌతం గంభీర్‌పై సీనియర్ల ఫిర్యాదు?
- హెడ్ కోచ్ గంభీర్ కోచింగ్ శైలిపై భారత సీనియర్ ఆటగాళ్ల అసంతృప్తి
- కొందరు బీసీసీఐ సభ్యులకు, మాజీ క్రికెటర్లకు అనధికారికంగా ఫిర్యాదు
- ఓటమికి బాధ్యత వహించకుండా ఇతరులను నిందించడమే కారణమని ఆరోపణలు
- అసంతృప్తి ఉన్నప్పటికీ గంభీర్‌కు అండగా నిలుస్తున్న బీసీసీఐ
- కోచ్ గా గంభీర్ భవిష్యత్తుకు కీలకం కానున్న శ్రీలంక టెస్ట్ సిరీస్
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కోచింగ్ శైలిపై జట్టులోని కొందరు సీనియర్ ఆటగాళ్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. రాహుల్ ద్రవిడ్ తర్వాత కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గంభీర్ పద్ధతులపై తమకున్న అభ్యంతరాలను కొందరు సీనియర్లు... మాజీ క్రికెటర్లతో పాటు బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్‌లోని సభ్యులకు అనధికారికంగా తెలియజేసినట్లు సమాచారం. ఈ పరిణామంతో గంభీర్‌పై ఒత్తిడి పెరుగుతోంది.
జట్టు ఓటమికి గంభీర్ బాధ్యత స్వీకరించడానికి ఇష్టపడటం లేదని, ఓటమి భారాన్ని ఆటగాళ్లు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లేదా సహాయక సిబ్బందిపై నెట్టేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని ఓ నివేదిక పేర్కొంది. ఓటమికి కారణం యాజమాన్య నిర్ణయాలు కాదన్నట్లుగా అతను వ్యవహరిస్తున్నాడని, ఈ భావనే ఆటగాళ్లలో అసంతృప్తికి కారణమవుతోందని తెలుస్తోంది. ఈ వ్యవహారం డ్రెస్సింగ్ రూమ్‌లోనూ చర్చనీయాంశంగా మారినట్లు సమాచారం. ఈ పరిణామాలపై బోర్డు అధికారులు కూడా ఆందోళన చెందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే, ఈ అనధికారిక ఫిర్యాదులు, ఆరోపణలు ఎలా ఉన్నప్పటికీ గౌతమ్ గంభీర్‌పై బీసీసీఐ పూర్తి విశ్వాసంతో ఉన్నట్లు స్పష్టమవుతోంది. జట్టులో ఇప్పటికీ అతడే కీలక అధికారిగా, సర్వాధికారాలు కలిగిన వ్యక్తిగా కొనసాగుతున్నారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలలో వైట్-బాల్ సిరీస్‌లలో ఓటములు, స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టుల్లో వైట్‌వాష్, దక్షిణాఫ్రికాతో సిరీస్ ఓటమి వంటి ఫలితాల నేపథ్యంలో గంభీర్ కోచింగ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ క్రమంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా శ్రీలంకతో జరగబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ గంభీర్, అతని కోచింగ్ బృందానికి అత్యంత కీలకంగా మారింది. పలువురు కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా ఈ సిరీస్‌కు అందుబాటులో లేకపోవడం వారికి అదనపు సవాల్‌గా మారింది. ప్రస్తుతానికి ఈ చర్చలన్నీ అనధికారిక స్థాయిలోనే ఉన్నాయని, గంభీర్‌కు బోర్డు మద్దతు కొనసాగుతుందని స్పష్టమవుతోంది.