ఇటలీ ప్రధాని మెలోనీకి మెలోడీ చాక్లెట్.. ప్రధాని మోదీకి పార్లే థ్యాంక్స్
- జార్జియా మెలోనీకి మెలోడీ చాక్లెట్ ఇచ్చిన మోదీ
- సోషల్ మీడియాలో పంచుకున్న ఇటలీ ప్రధాని
- ప్రపంచవేదికపైకి తీసుకువెళ్ళారంటూ పార్లే థ్యాంక్స్
"పార్లే మెలోడీని ప్రపంచ వేదికపైకి తీసుకువెళ్లినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు. భారతీయుల అభిమాన ఉత్పత్తి సరిహద్దులు దాటి పంచుకోవడాన్ని చూడటం మనందరికీ గర్వకారణం" అని పార్లే ప్రొడక్ట్స్ తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేసింది.
పార్లే ప్రొడక్ట్స్ ఈ వీడియోను "1983 నుండి సంబంధాలను తీయగా చేస్తున్నాం" అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా షేర్ చేసింది.
మెలోని షేర్ చేసిన క్లిప్‌లో, "ప్రధానమంత్రి మోదీ మాకు ఒక బహుమతి ఇచ్చారు. చాలా చాలా మంచి టాఫీని తెచ్చారు" అని ఆమె చెబుతుండగా, ఆ ఇద్దరు నాయకులు నవ్వుతూ కలిసి "మెలోడీ" అని అనడం వినబడుతుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించి, వీక్షణలు మరియు ప్రజాదరణ పరంగా ఒక రికార్డు సృష్టించింది. కొన్ని గంటల్లోనే 10 కోట్ల వీక్షణలను దాటిందని సోషల్ మీడియా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.