"తమిళనాడు సీఎం విజయ్": 'జననాయగన్' టైటిల్ కార్డు వీడియో వైరల్!
- టైటిల్ కార్డుపై 'ముఖ్యమంత్రి విజయ్' అంటూ సోషల్ మీడియాలో సందడి
- విజయ్ అభిమానులను అలరిస్తున్న ఏఐ వీడియో
- ఇంకా విడుదల కాని జన నాయగన్
ప్రభుత్వం ఏర్పాటు సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తున్న తరుణంలో, విజయ్ అభిమానులను ఉత్సాపరిచే ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. 'జననాయగన్' టైటిల్ కార్డుపై దళపతి విజయ్ అని కాకుండా, 'ముఖ్యమంత్రి విజయ్' అంటూ వేసి అభిమానుల్లో ఈ క్లిప్ సంతోషాన్ని నింపింది.
వైరల్ అవుతున్న ఈ క్లిప్‌లో "తమిళనాడు గౌరవ ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్" అని పరిచయం చేయగా, థియేటర్‌లో ప్రేక్షకులు కేకలు వేస్తూ సంబరాల్లో మునిగిపోయినట్లు ఉంది. తొలుత దీనిని అధికారిక అప్‌డేట్‌గా భావించారు. ఈ క్లిప్‌ను 'ఏఐ' ద్వారా అభిమానులు ఎడిట్ చేసినదిగా తెలుస్తోంది. ఏదైనప్పటికీ, విజయ్ అభిమానుల్లో మాత్రం ఈ క్లిప్ ఎనలేని సంతోషాన్ని నింపుతోంది.
కాగా, విజయ్ హీరోగా నటించిన జన నాయగన్ జనవరిలో పొంగల్ సందర్భంగా విడుదల కావాల్సి ఉండగా, సెన్సార్ కారణాలతో విడుదల నిలిచిపోయింది. విజయ్ అధికార పీఠం ఎక్కాక జన నాయగన్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.