పవన్‌ను పరామర్శించనున్న సీఎం చంద్రబాబు.. నేడు హైదరాబాద్‌కు పయనం
- ముక్కుకు శస్త్రచికిత్స తర్వాత హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుంటున్న పవన్
- సాయంత్రం 5 గంటలకు పవన్ నివాసానికి వెళ్లనున్న ముఖ్యమంత్రి
- దివంగత పారిశ్రామికవేత్త జీఎన్ నాయుడు కుటుంబాన్ని కూడా పరామర్శించనున్న సీఎం
గత నెలలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వైద్య పరీక్షల అనంతరం ఆయన ముక్కుకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆపరేషన్ తర్వాత పది రోజుల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో, పవన్ గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని తన నివాసానికే పరిమితమయ్యారు.
ఇదిలావుంచితే, ఇటీవల కన్నుమూసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, రీజెన్సీ సెరామిక్స్ అధినేత జీఎన్ నాయుడు కుటుంబాన్ని కూడా చంద్రబాబు పరామర్శించనున్నారు. నందగిరి హిల్స్‌లోని వారి నివాసానికి వెళ్లి కుటుంబసభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేయనున్నారు.