మహిళల టీ20 ప్రపంచకప్‌కు ప్రైజ్ మనీ ఎంత పెరిగిందంటే?
- గత టోర్నీ కంటే 10 శాతం పెరిగి రూ.81 కోట్ల ప్రైజ్ మనీ ప్రకటన
- 2024 ఎడిషన్‌లో రూ.70 కోట్ల నగదు బహుమతి ప్రకటన
- విజేతకు రూ.21.8 కోట్లు, రన్నరప్‌కు రూ.10 కోట్ల ప్రైజ్ మనీ
న్యూజిలాండ్ గెలిచిన గత టోర్నమెంట్‌లో 10 జట్లు పాల్గొనగా, రాబోయే మహిళా టీ20 ప్రపంచ కప్‌లో మరో రెండు జట్లు జత కలుస్తున్నాయి.
ఈసారి విజేతగా నిలిచిన జట్టు రూ.21.8 కోట్లు, రన్నరప్ రూ.10 కోట్లు గెలుచుకోనున్నాయి. సెమీస్‌లో ఓడిన జట్లకు రూ.6 కోట్ల చొప్పున ఇవ్వనున్నారు. గ్రూప్ దశలో గెలిచిన ప్రతి జట్టుకు రూ.29 లక్షలు అందజేస్తారు. టోర్నీలో పాల్గొనే ప్రతి జట్టుకు (గ్యారెంటీ మనీ) కనీస హామీగా రూ.2.3 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు.