గుండెపోటుతో తండ్రి మరణం.. కన్నీళ్లతో పరీక్షకు కొడుకు..!
- యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదకర సంఘటన
- తండ్రి హఠాన్మరణంతో శోకసంద్రంలో మునిగిన కుటుంబం
- దుఃఖాన్ని దిగమింగి పదో తరగతి పరీక్ష రాసిన తనయుడు
వివరాల్లోకి వెళితే.. గుండాల మండలం వస్తకొండూరులో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఎల్లయ్యకు శుక్రవారం ఉదయం ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు నల్గొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. తండ్రి హఠాన్మరణంతో కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. అయితే, శనివారం ప్రారంభమైన పదో తరగతి వార్షిక పరీక్షలను ఎలాగైనా రాయాలని కుటుంబ సభ్యులు, బంధువులు హర్షవర్ధన్‌ను ఓదార్చి పరీక్షా కేంద్రానికి పంపారు. హర్షవర్ధన్ చూపిన ధైర్యాన్ని చూసి ఉపాధ్యాయులు, స్థానికులు కంటతడిపెట్టారు.