కాంగ్రెస్ నిరసనలపై జగన్ ట్వీట్... "అమోఘం" అంటూ నారా లోకేశ్ కౌంటర్
- యూత్ కాంగ్రెస్ తీరు సిగ్గుచేటంటూ జగన్ విమర్శ
- జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన మంత్రి లోకేశ్
- గతంలో పెట్టుబడులను దెబ్బతీశారంటూ జగన్‌పై ఆరోపణలు
- జగన్ నకిలీ సానుభూతి ప్రదర్శిస్తున్నారని లోకేశ్ ఎద్దేవా
జగన్ హిపోక్రసీ (కపటత్వం) అమోఘమని లోకేశ్ ఎద్దేవా చేశారు. "భారతదేశ పెట్టుబడుల వాతావరణాన్ని అందరికంటే ఎక్కువగా దెబ్బతీసిన వ్యక్తి, ఇప్పుడు నకిలీ సానుభూతి ప్రదర్శిస్తున్నారు" అని విమర్శించారు. ఈ సందర్భంగా జగన్ గతంలో తీసుకున్న పలు నిర్ణయాలను లోకేశ్ ప్రస్తావించారు. 2017లో ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌ను అడ్డుకునేందుకు ఎయిర్‌పోర్టులో ధర్నా చేయడం, 2019లో విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయడం, 2020లో అమరావతిలో సింగపూర్ ప్రభుత్వ పెట్టుబడులను వెనక్కి పంపడం, 2025లో ప్రభుత్వ నిధుల సమీకరణను అడ్డుకోవాలని ఆర్బీఐకి లేఖ రాయడం వంటి చర్యలను గుర్తుచేశారు. ఇప్పుడు ఏఐ సమ్మిట్ గురించి ఆందోళన చెందుతున్నట్లు నటించడం విడ్డూరంగా ఉందని లోకేశ్ వ్యాఖ్యానించారు.