ఏపీ లిక్కర్ స్కామ్ లో మరో కేసు నమోదు చేసిన సీఐడీ
- డిపోల నుంచి మద్యం దుకాణాలకు సరఫరా చేసే టెండర్లలో అక్రమాలు
- రూ. 200 కోట్ల నుంచి రూ. 400 కోట్ల వరకు అక్రమాలు జరిగినట్టు సమాచారం
- విచారణ బాధ్యతలు సిట్ చీఫ్ రాజశేఖర్ బాబుకు అప్పగింత
మరోవైపు, లిక్కర్ స్కామ్ లో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న రాజ్ కేసిరెడ్డి బెయిల్ పిటిషన్ ను ఇటీవల సుప్రీంకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో రాజకీయ నాయకులు, అధికారుల ప్రమేయంపై కూడా సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ స్కామ్ లో రూ. 3,500 కోట్లకు పైగా అక్రమ లావాదేవీలు జరిగినట్టు సిట్ అధికారులు అంచనా వేశారు. ఈ కేసును ఈడీ కూడా దర్యాప్తు చేస్తోంది. పలువురు వ్యక్తులకు ఇప్పటికే నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసులో ఇప్పటి వరకు 12 మందిని అరెస్ట్ చేశారు. మరో 9 మంది విదేశాల్లో తలదాచుకున్నట్టు సిట్ అధికారులు తెలిపారు.